పుట:Chandragupta-Chakravarti.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

3]

రెండవ ప్రకరణము

17


వెఱచి నీచమును హాస్యాస్పదమును నగు నన్న సత్రాధికారమందుంచిరి. ఇచటను మరి పగతీర్పునకు సమయోపాయములనెదురు చూచుచున్న చంద్రగుప్తు డొకనాడు ఆగ్రహావతారమనదగిన యొక అగ్రజన్ముని జూడగల్గెను. ఈతడు కాలికి దగిలిన యొక గడ్డిపోచను వేరుతోబీకి నిప్పున గాల్చి మిగిలిన బూదిని నీళ్ళలో గరగించి త్రాగెను. అదిగని మౌర్యుడు, ఇటువంటి చండకోపియే నంద నిర్మూలనమునకు దగినవాడని నిర్ణయించెను.

గుప్తుడను పేరుగల యా బాలద్విజుండు ఔశనునిదండనీతియందును, జ్యోతి శాస్త్రమందును పారంగతుడు ; నీతిశాస్త్ర ప్రణేతయగు చణకుని నందనుండు చాణక్యుడని ప్రసిద్ధిగాంచిన శ్రోత్రియుండు, సర్వధర్మవిదుండు, గుణాఢ్యుండు ఈ బ్రాహ్మణుడు వేదములన్నిటిని వల్లెవేసినవాడు, శాస్త్రములన్నిటిని జదివినవాడు, ముఖ్యముగ బృహస్పతి, శుక్రుడు, మున్నగువారి --- తుల యందత్యంత ప్రవీణుడు, నైజమైన బుద్ధి సామర్థ్యమును సమయ స్ఫూర్తియు గలవాడు, మిక్కిలి ముక్కోపమును, పట్టినపట్టు వదలని గట్టి దిట్టతనమును గలవాడు. ఇతడొకనాడు నందులశాలలో నొకదాని యందు బహుజనమధ్యమున నగ్రాససమునందు గూర్చుండి యుండెను. అపుడెయచటికి నందులు వచ్చుటదటస్థించెను.వచ్చి యావికృత రూపుడును బ్రహచారియునగు బ్రాహ్మణుని బూర్వోత్తరముల విచారించి నందుల వెంటవచ్చిన వారి మంత్రులును మూగి