పుట:Chandamama 1947 07.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీ తాత

ప్రతి యింట్లో ఒక తాతయ్య ఉండవచ్చు, కాని ఒక దేశంలోనివారందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య ఉండటం చాల కష్టం. అలాంటి తాతయ్యలు ఏ వెయ్యేళ్ళకో ఒకసారి దొరుకుతుంటారు. ఇవాళ మన భారతీయులందరికీ ఒక తాతయ్య ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు కదూ? ఆయనే గాంధీ తాత! మనం చెప్పుకోవాలంటే ఆయన కథలు చాలా ఉన్నాయి.

మన తాతయ్య తండ్రిగారు కరంచంద్ గాంధి; తల్లిగారు పుత్తలిబాయి. ఆయన 1889 అక్టోబరు 2 తేదీన పోర్‌బందర్ అనే గ్రామంలో పుట్టాడు. ఈ గ్రామాన్ని సుధామపురం అనికూడాఅంటారు. మనతాతయ్యకు బాల్యం పోర్‌బందరులోనే గడిచింది. ఆ ఊరిబళ్లో మూడో