పుట:Chakkatladanda.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాసు శ్రీరాములుగారు...బహుముఖ ప్రజ్ఞాశాలి; ప్రతిభా వ్యుత్పత్తులు సమపాళ్లలో రంగరించుకొన్న కవి, గొప్ప ధారాశుద్ధిగలిగిన రచయిత. న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, జ్యోతిశ్శాస్త్రవేత్తగా ప్రసిద్ధులు. వారి లేఖిని మంచి వెలువడిన ఈ చక్కట్ల దండ- కి శ. 1894 వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తి అయినదని కవి యిల్లా అంటున్నారు.

జయ సంవత్సరం (గెలుపు సాలున) వర్షర్తవునందు (వానకారు) శ్రావణమాసంలో (మింటి నెలయందు) కృష్ణపక్షంలో (వన్నెతగ్గెడినాళ్లు) పంచమినాడు (పడగ తాల్పెడి రోజు) అశ్వనీ నక్షత్రమందు. (జేజేల వెజ్జులు) వృశ్చికలగ్నంలో (చెలగిన తేలు) అనగా అపహార్ణం 3-00 గంటలకు ఇది పూర్తి అయింది. (వృశ్చిక రాశియని' పొరపాటున వడి ఉండవచ్చును.)

కవిగారు చక్కని ధారాశుద్ధిగలిగిన రచయిత అన్నాం. క్రింది పాదాల్లో అది ప్రస్ఫుటం.

 
1.కురియక కురియక కురిసెనా మొయివారి
        యెడవాన పొలమెల్ల యెద్దుకన్ను
   కాయక కాయక కాచె నా తరం బూచి
       గున్న మామిడి కొమ్మ కోటివేలు .....

2. పొరుగు వారికి మేలు పొందరాదందువా
        ఇరుగువారికి నీవ పొరుగువాఁడు
   ఇరుగు వారికి మేలు పొందరాదందువా
        పొరుగు వారికి నీవ ఇరుగువాఁడు
        
3. నెలదప్పి నంతనె నిసువు పుట్టఁగఁ బోదు
        నిండఁ దొమ్మిది నెలలుండవలయు
   వరినాటి నంతనే వడ్లురాలవు పంట
        కళ్లాల దనుకనుఁ గాయవలయు ...
        
కవిగారు హాస్యప్రియులు: ఉదాహరణకు

1. పడి సెంబు పట్టిన పాదుషా మీఁగడ
        చీదునా చీమిడిఁ జీఁదుఁగాక..