పుట:Chakkatladanda.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ తోడుపాటున కెద్దు దున్ను కోనిచ్చిన| మొగము మాడుపుకాపు ముట్టె జూచు
పున్నెంబునకు గాపు పుట్టెడాళ్ళిచ్చిన | ఆసదీరని బాపడడ్డ జూచు
కనికరానకు నత్త గారెబూరెలు బెట్ట | కొంటె కోడలు పుట్టినింటి కంపు
పరువుకై కోడలువడి యూడిగము సేయ | గట్టువాయత్త కాళ్లడుగు మనను

గీ॥ తనివిగల వారికిని జేయుపనులు సెల్లు | తనివి లేనట్టివారికి దగదుసేయ
అని పలుకు . . . . . 81

సీ॥ రాని కన్నడబాస పూని మాటాడబో | భేకు జెప్పగబోయి సాకఁ జెప్పు
తెలియని వాని మద్దెలగ్గొట్ట బెట్టిన | నంటు బోనము కుడినదికి మొత్తు
అలవాటులేని సాములు సేయజని గత్తి |మొనచేత జట్టుక మొదల బొడుచు
ఎరుగనివాడు తానేరు బన్నగబోయి | దుంపకాడిని పై చితుదను దున్ను

గీ॥ అబ్బెసములేని పనులు సేయంగ రాదు | చేసెనేనియు దప్పులు సేయకున్నె
అని పలుకు . . . . . 82

సీ॥ పనస వంకరయైన దొనలు పుల్లనగావు | చెరుకు వంకరయైన జేదుగాదు
యేళ్ళు వంకరయైన నీళ్ళు కారెక్కవు | మెరుపు వంకరయైన మెరుగు బోదు
మడి వంకరైన జూములు పొల్లుగా బోవు | పూవు వంకరయైన దానిబోదు
కుడుము వంకరయైన గడుపులో నొచ్చదు | వెండి వంకరయైన విలువ చెడదు

గీ॥ వంకరలకేమి గొనమె కావలయుగాక | యెంచి చూచిన వంకర యెందులేదు
అని పలుకు . . . . . 83

సీ॥ కాపులందరు గూడి గంగజాతర జేయ | దొలగునే సివమాడు తొత్తుకొలువు
వదుగు రూరనులంచ పంచాలు బెట్టంగ | తప్పునేచాటు చందాల పోటు
సాటివారలు వెట్టిచాకిరీ కొడబడ్డ | దీరునే వినక సర్కారుహుకుము
వాడలో వారెల్ల, వలస బోయిననెట్టు | లెత్తిపోవున బుట్ట నెత్తి బెట్ట

గీ॥ నలుగురేగిన దారినే నడువు మంద్రు | మంచిదో కాదౌయది యేరు నెంచలేరు
అని పలుకు . . . . . 84

సీ॥ కల్లందరికి నొక్కకంపె కొట్టునుగాని |కంపు త్రావెడివాని కింపుసుమ్ము
వల్లమందెన్న సందరికి జేదేకాని | మంచు మ్రింగెడివాడు మానలేదు
గంజాయి యేరికి గై పొక్కటియె కాని | కయిపు గొట్టెడువాని గలచలేదు.
చెడిపి పొందేరికీ జెరుపు తెచ్చును గాని | చెడిపె నుంచినవాడు విడువలేడు

గీ॥ చెడ్డచెడ్డయె మంచిమంచియె దలంప | వానియందిచ్చ యలవాటువలన బెరుగు
అని పలుకు . . . . . 85