పుట:Chakkatladanda.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

చక్కట్లదండ

యను

లౌకిక నీతిమాలిక

  


సీ౹౹ సిరికిఱొమ్మిచ్చి మచ్చిక సేయు నిచ్చలు| వెన్నుండు దావేల్పు వేలువయిన
మిన్నేటిచెలి నెత్తిమీద బెట్టుకు మోచు |ముక్కంటి జేజేల ముదుకయయిన
పలుకువెలది నోటబట్టి ముచ్చటలాడు| బెమ్ము దాదిరగంటి పెద్దయయిన
కలువకంటులగిద్దె గదలనీ కాడింత్రు| దెసరేండ్లు బాసవాల్దిట్టలయిన

గీ॥ కస్తి రానీక నిల్లాండ్ర గాచువారి| యింట సేమంబు దరుగళ యుంట నిజము
అని పలుకు దాసురాముడి ట్ల చ్చతెనుగు| కబ్బ మందమునిండఁ జక్కట్ల దండ ...1

సీ౹। బంగారుబొమ్మకు రంగు బూయగనేల| పేడబొమ్మకు బూయగూడుగాక
పాసెంబునకు సూరుఁ బద్ద నంజగనేల| చోడంబలిని నంజ గూడుగా క
పెద్దమఱ్ఱికి గాలిబెట్టు బెట్టగనేల | మేడి మ్రోకకు బెట్టగూడుగాక
వెండిగిన్నెకు జింతపండు పుల్కా పేల | వాడ నిత్తడికిడ గూడుగాక.

గీ౹౹ వాసిగలవారి కింకొక్క వాసితోడువల దలంతికి నెపుడుగా వలయుగాక.
అని పలుకు . . . . . 2
   
సీ।౹ కోతి దాఁజెట్టెక్కి కూసినంతనె క్రింది | కొదమసింగము వాసి కొరతవడునె
లంజరాయని మెప్పురా మరుల్కొల్పిన | నిల్లాలి మరియాద చెల్లకున్నె
పుల్లేరు దానెంత పౌరలివచ్చిన బెద్ధ | కొల్లేటి కడుపు దాగొదవయగునే
ప్రాఁచితీగెలు చాల ప్లయిబారి పెరిగిన|మద్ది మానికి లావు కొద్దియగునె

గీ॥ క్రి౦చుమానికి తానెంత గింజుకొన్న మంచివాని పొగడ్తలు మాన్పలేడు
అని పలుకు . . . . . 3