పుట:Chakkatladanda.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిగారికి కొన్ని మోజులున్నాయి, చూడండి.

  
1. విక్టోరియారాణి వెలసి యేలుటఁ బట్టి
       యిండియా పొగడిక యెక్కువాయెఁ
   బండ్ల తోటలు దొడ్డపైరులఁ బట్టి
       మద్రాసు ప్రెసిడెన్సి మంచిదాయె
   తియ్యఁజక్కెరవంటి తెలుఁగును బట్టి గో
       దావరి డిస్ట్రిక్టు ఠీవిఁగాంచె
   మేలైన పని తివాచీల నేఁతను బట్టి
       యేలూరు పెద్ద పేరెక్కెనాయే....

2. గెలుపిండియానాడ! గెలుపింగ్లీషు మాట!
       గెలుపు వేలుపుఁబాస : గెలుపు తెలుఁగ!
   గెలుపు స్టీమరులార! గెలుపురెల్రోడ్లార!
       గెలుపు హైస్కూళ్లార: గెలుపు సైన్స !
   గెలుపు కాలువలార! గెలుపు సోద్దెపు టాన
       కట్టలారా! టెలిగ్రాపులారా !
   గెలుపు డార్విన్ భేరీ! గెలుపు థియోసఫీ :
       గెలుపు నేషనలు కాంగ్రెస్స నీకు :
   గెలుపు విక్టోరియా రాణి! గెలుపు గెలుపు
   గెలుపు గెలువని పలుకుటె గెలుపు మనకు...

ఇల్లా చూపించుకొంటూపోతే, పుస్తకముతా ఉదాహరించాలి; ప్రతి పద్యంలోనూ, ప్రతిపాదంలోనూ ఏదో ఒక విశేషం ఉంటోంది మరి!

మరి సెలవు