పుట:Bobbili yuddam natakam.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాంకము.

27

రంగ. - వేంకటలక్ష్మి, పన్నీరు తెమ్ము కన్నులు, కడుగుకొనవలయును.

వేంకట. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.

రంగ. - తమ్ముడా, ఈ డాబామీద చల్లగాలిలో కూర్చుందము.

[ఇద్దఱును ఆరోహణ మభినయించి పరిక్రమించి కూర్చుందురు.]

వేంకట. - [ప్రవేశించి] ఇదిగో పన్నీరు. [అని పన్నీటి కూజాను రంగారాయనిచేతి కిచ్చును.

రంగ. - [కయికొని, చల్లుకొని, కడిగికొని, పన్నీటిగిండిని వేంకటలక్ష్మి చేతికిచ్చి] వేంకటలక్ష్మి, నీపని నీవు చూచుకొనుము. [

వేంకట. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.

రంగ. - ఏమి తమ్ఁముడా, ఈరాత్రి కర్పూరములు వేసినను అత్తరువులు పోసినను, కాగడాలు మసక మసకగానే మండినవి ?

వెంగళరావు. - అన్నయ్యగారూ, నిద్రలేమిచే మనక నులు మసక లైనందున అ ట్లగపడి యుండును.

రంగ. - కాదు తమ్ముఁడా ; జ్వాలలు రాత్రి యెల్ల చీలికలు చీలికలుగానే అగపడినవి.

[నేపథ్యమున నౌభత్తు వాయింపఁబడును.]

రంగ. - ఏమి తమ్ముఁడా, నేఁడు మననౌభత్తు రోదనమువలె వినఁబడు చున్నది !

[ఫిరంగియగాదు. ఇరువురును అడిచిపాటుతో శ్రవణ మభినయింతురు.

రంగ. - (ససంభ్రమము) ఇదేమి తమ్ముఁడా! ఊరిబయటనుండి వెండియు ఇట్టి ఫిరంగిమ్రోత వినఁబడుచున్నది ! తమ్ఁముడా, ఇది -

          సీ. కల్పాంత కాలంపుఁ గాఱుమొగు ళ్లెల్ల
                     నొక్కుమ్మడిగఁ గూడి యుఱుముటొక్కొ ?
              క్షయమున విశ్వంబు గాల్చుకా లాంతకు
                     గళగహ్వరపు మహాగర్జయొక్కొ ?
              కంబాననుండి రక్కసునిపైఁ బడు దంభ
                     హర్యక్షు ఘోరాట్టహాస మొక్కొ ?
              బెడిదంపు బడబాగ్ని వెడఁదఫిరంగి యై
                     మొత్తంబుగా మ్రోత మ్రోయుటొక్కొ ?