84 బిల్వమంగళ [అం 4
సాధు - అదే చూస్తూన్నాను.
దాసి - పోదలచుకొన్నది తాళముచెవులేనా నాకిచ్చింది కాదు, దానికి నే నెంతమేలు చేసినాను!... కలికాలము !
సాధు - అంత ధర్మదృష్టి యిప్పటివాళ్ళకా! "ధర్మస్య సూక్ష్మాగతి:" అంటారు.
దాసి - మాటల కేమికాని, ఈ పాడుపెట్టెను పైకి తవ్వగలవా? మగవాడ వాపాటి బలము లేదా? గునప ముంటే నేను తవ్వితీయగలను!
సాధు - చప్పుడు కావచ్చునా? గట్టిగా కొట్టి బద్దలు చేయవచ్చును, కాని చప్పుడు మాటో?
దాసి - మగవాడవు - ఈపాటి ఉపాయము తోచ లేదా నీకు?
సాధు - ఆలోచిస్తూన్నాను.
దాసి - మూడు నాళ్ళనుండీ మొత్తుకొంటున్నావు - మట్టిబుర్ర! ఆలోచన శూన్యము ! పోలీసువాళ్ళు వచ్చేసరికి నీకూ ఉపాయము తోస్తుంది కాబోలు!
సాధు - ఏమి చేయమన్నావు? నేను తలచిందొకటి, జరిగింది ఇంకోటి! గోడత్రవ్వి పెట్టె తీస్తాను - అదృష్ట మెట్లుంటే అట్లు జరుగుతుంది - (త్రవ్వబోవును)
(లోపల - ఎవరక్కడ? తలుపు తీయండి)
దాసి - అమ్మయ్యో! ఎవరు వారు! పోలీసువాళ్లేమో!