పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగో అంకము

_______

మొదటి రంగము

(చింతామణి ఇంట్లో గది - దాసి, సాధువు వత్తురు.)

దాసి - ఎక్కడికి పోయిందో ఊరంతా వెదకినా ఎక్కడా కనబడలేదు.

సాధు - ఆ పిచ్చి సముద్రములో పడి యేవాడకో కొట్టుకొని పోయింది.

దాసి - మన మేమి చేతాము?

సాధు - అదే గొప్ప సమస్య. పోలీసువాళ్ళకి తెలుస్తే ఇదంతా కొనిపోతారు. ఏమిటి దారి?

దాసి - ఔను. మొన్న అంబిక ఆస్తంతా తీసుకొన్నారు. మగవాడవు, నీవే ఆలోచించు - ఆడదాన్ని నాకేమి తెలుస్తుంది?

సాధు - సొత్తంతా బైటికి దాటించవలెను - అదే మనము చేయతగ్గ పని.

దాసి - దాటించడ మేలాగు? పెట్టె చాలా బరువు, గోడలో తాపడము చేసినారు.