పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 4] బిళ్వమంగళ 65

దాసి - నీకి దెక్కడిది?

సాధు - ఇదెప్పుడూ నాదగ్గర నుంటుంది. నా కనుక్షణమూ చావవలెననే యుంది, కాని నీమీదిప్రేమచేత నిట్లు జీవించియున్నాను. నీవు చిక్కకుంటే చావడము నిశ్చయము!

దాసి - ఈపని నావల్ల కాదు. వంటింట పాలున్నవి, నీ చిత్తమువచ్చినట్లు చేయవచ్చును-నేనింట్లో ఉండను-అంతా నీవే చక్కచేయుము.

సాధు - నే నొక్కడనే పాతగలనా?

దాసి - పడుచువాడవు పాతలేవా? నాచేతకాదు సుమా! ఆమా టంటేనే నాకడలు.

సాధు - నీకేమి భయమూ? రహస్యమైన చోటు చూపితే మిగిలింది నేనే సర్దుకొంటాను.

దాసి - ఆమె సర్వస్వమూ నాచేతిలో నుంది-మంచి వాళ్ళ దొకటే మాట-ఏమి జరుగుతూంటుందో చూస్తాను.

సాధు - అదీ మాట! (పిచ్చిది పోవును)

దాసి - చెప్పే దొకటి, చేసే దొకటి నాచేతకాదు.

బిచ్చ - అభ్భా! ఈదుర్మార్గు డెంతచేయ దలచినాడు! తలవ్రాత ఎట్లుండే అట్లు తప్పకుండా జరుగును. అదే ఆమె వస్తూన్నది, అంతాఆమెతో చెప్పుతాను. ఈ పిచ్చిదికూడా వచ్చిందే?... పాపముచేసిన ప్రాణము క్షోభిస్తుంది - పాప మమాయికురాలి నెంత చేయదలచినారు వీరిద్దరు! ఆమె యెవ