పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 4] బిల్వమంగళ 63

నాలుగో రంగము

_______

(చింతామణి యింటియెదుట పొదలో బిచ్చగాడు బైట దాసి సాధువున్నూ ప్రవేశము.)

దాసి - ఇంట్లోకన్న నిక్కడమేలు. నాల్గువైపులా దారులున్నవి, మనమాట లెవరికీ వినిపించవు.

బిచ్చ - (స్వ) అట్లే యనుకోండి- నే నిక్కడున్నాను.

దాసి - నీవు తిరిగీ రుద్రాక్షలతో సిద్ధమయినావా? పిచ్చవానిలాగు రమ్మన్నాను కానా?

సాధు - నీతో నొకరహస్యము చెప్పవచ్చినాను.

దాసి - నీ కృష్ణప్రేమ అటుంచి, కర్తవ్య మూహించు. మాయజమానురా లిప్పు డేమీ చూడడములేదు. బీదసాద లెవ్వ రగుపడినా, వారికి కావలసినంత ధన మిస్తూన్నది. నీవూ అడిగిచూడు, నీప్రాప్త మెట్లుందో.

సాధు - చెట్టంతా పెల్లగించడము శ్రేయము కాదా?

దాసి - అనగా?

సాధు - దేనినీ చూడలే దన్నావే?

దాసి - ఓహో! అంతా ఒక్కసారే హరిస్తా నంటావా? అబ్బో? ఒకక్షణమైనా యిల్లు విడిచిపోదు. తలుపులన్నిటికీ తాళాలు, సాయంత్రము స్నానానికి పోతుంది. దొంగలాడితే నీకు మంగలము దొరకునేమో! ఇనుపపెట్టె బద్దలు గొట్టి లొడ్డు లొసుగూ దక్కించుకోగలవా?