రం 1] బిల్వమంగళ 11
మాట బాగాలేదు సుమా!
బిల్వ ... దాసీ, నీవేమీ చెప్పనక్కరలేదు - ఇక నేను రాను. నా దు:ఖమంతా నీ కొకనాడు తెల్పుతాను - నేను గొప్పయింటివాడను. గౌరవ మెచ్చటపొందిన నక్కడుంటాను. కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
చింతా - ఏమీ? నేను నిన్నేమన్నాను? దాసి యింట్లో లేదు - నేను భోజనానికి కూర్చున్నాను, అందుకోసము తలుపు తీయడమునకు జాల మైంది, ఈపాటిదానికే నీ మనసులో కోపాగ్ని రాత్రిఅంతా రగులుతూనే ఉండనా? గౌరవ మెక్కడ కలిగిన నీ వక్కడికిపోదువా? నేనిదివరలో చెప్పినాను - బాగా ఆలోచించుకో.
దాసి - నా దొకమాట - ఆడవాళ్లిట్లు వీధిలో పడడము అన్యాయము.
చింతా - నీనెత్తి! నేను జలకమాడ వచ్చితిని - న న్నెందుకు నిందిస్తావు? ప్రొద్దుటనుండీ ఇక్కడ హాయిగా ఉన్నాడు. అతనికేమి? ఏమయినాడో అని నేను చస్తూ ఉన్నాను. ఒక మాటైనా కనిపించలేదు!
దాసి - అయ్యా! ఇ దన్యాయము కాదా? ఆడది, చిక్కిఉంది, ఆమెగతి "తానుండి తనతల్లి గొడ్రా" లన్నట్లుంది.
బిల్వ - చింతామణీ, నిన్ను చూస్తే నాకు విచారముగా నుంది.