పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 బిల్వమంగళ [అం 1

బిచ్చ - పాట

గౌరీమనోహరి రాగము - (బ్రోవసమయమిదే రామయ్యవరుస) సరసుడు దూరెనుగా పొదలో - సరసుడు దూరెనుగా పొదలో!

                      మరిమరినిన్ను మరపించుచుండె-
                                     చేరివానిచెంత జేర్చుకొమ్మునీదు|| సర||
                      మనసులోని మా-టను దెల్పడాయె-
                                     ధనములేమి చిన్నతనము నొందెనో?
                      వనములోన జీ-వనముసల్పునేమొ
                                     -కనుమువాడద్దరి-గొనజూచు చుండె ||సర

బిల్వ - (స్వ) దానికి నాచింతేలేదు-నవ్వుతూన్నది - (ప్రకా) కట్టెలుకొనడాని కిట్లు వచ్చినాను- కంటపడ్డావు కావున ఒకమాట చెప్పెదను.

                      చింతలోననున్న చిరునవ్వు వెలయునా?
                                     విశ్వదాభిరామ వినుర వేమా.||

చింతా - ఏమన్నావు? కర్ర లెందుకు ? నీ చితిపైన పేర్చుటకా?

బిల్వ - నీ వుదార వనుకొంటిని కాని వట్టి తుచ్చురాలవు సుమా !

చింతా - అబ్బో! నీవుదారుడవా ? నీపనులే తెల్పుతూన్నవి లే-ముంజేతు కంకణమ్మున కద్దమేల?

దాసి - అయ్యా, నామాటవినండి - మీరు గొప్పవారు గనుక ఈమె మాటలు పాటించకండి - చింతామణీ, నీవన్న