పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112 బిల్వమంగళ [అం 5

                               అనుతాపవహ్నిచే ♦ తను దగ్ధమయ్యె,
                     ప్రేమాంకురం బెట్లు ♦ పెంపొందుదీన? నిది
                               ఆర్పింప కృష్ణునకు ♦ నర్హ మయ్యెడునా?
                     లేకున్న దయజేసి ♦ నాకు బోధింపుమా
                               ఏ తెరంగున్నదో ♦ ఏర్పరచి తండ్రి!
                     పాత్రత యబ్బ గో ♦ పాలునిదయకు నే
                               డైహికమందు నా ♦ కరుచి జనియించె!

సోమ - అమ్మా, నేను దీనుడను, హీనుడను, నీ కేమి యుపాయము జూపగలను? ఈపురముననే బిల్వమంగళుడను సిద్ధుడున్నాడు. అతని శరణు వేడితివా, తరణోపాయము తప్పకుండా చూపగలడు.

చింతా - అయ్యా! మీరు నాకు గురువులు-ఉపాయముందని విన్నతోడనే నా కాశ కలిగింది, కాని నేను మహా పాతకిని, ఆతని యెడ నెన్నో అపరాధము లొనర్చినాను.

సోమ - సంకోచింపకు. ఆతడు పరమయోగి, అపరాధములను లెక్కచేయువాడు కాడు.

చింతా - నా దురదృష్టమువల్ల మీ యుపదేశము విఫలము గాకుండుగాక! ఆత డెక్కడ నున్నాడో సెలవిచ్చెదరా? ఇక్కడికి వచ్చినప్పటినుండీ వెతుకుతూన్నాను, దర్శనము కాలేదు.

పిచ్చి - నేను చూపిస్తాను రా. నీవు నాకూతురివి కనుక నిన్ను నీపతి కర్పించుతాను. ని న్నక్కడ విడిచి పోయె