పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110 బిల్వమంగళ [అం 5

బిచ్చ - అబ్బే! ఇందులో ఏమీ లేదు...(తడబడును)

గోపా - లేకుంటే అది యీలాగు తే. ఆ ముడి ఎందుకు?

బిచ్చ - ఓహో! ఇది బృందావనము. (మూట పారవేయును)

చింతా - ఏమి నాయనా, నాతో నేస్తముకట్టి ఇంకొకనితో మైత్రి చేస్తావా?

గోపా - ఏమీ? కూడదా?

చింతా - ఆలాగైతే మనకు మైత్రి పొసగదు.

గోపా - పోనీ, నన్ను పిలిచినప్పుడే వస్తాను! (పో బోవును)

చింతా - ఆఁ ఆఁ. ఉండుండు.

గోపా - ఎందుకూ ? మనకు పొసగ దన్నావే! (పోవును)

బిచ్చ - బాబూ, బాబూ, కొంచె ముండు.

చింతా - అయ్యో! పోయెనే! నా కాకలి వేస్తూంది.

బిచ్చ - ఏమైనా తెచ్చిపెట్టనా?-అదిగో పిచ్చిది.

(పిచ్చిది వచ్చును)

పిచ్చి - తెలిసింది-శ్రీకృష్ణుడు నన్నుబ్రోచును, నాతల్లిని చూడగానే నాకు ధైర్యము చిక్కింది. కాత్యాయని నారాధించి గోపికలు శ్రీకృష్ణుని పొందినలాగు నే నేమి నాశ్రయించి నాకోర్కె సఫలము చేసుకుంటాను. మాఅమ్మ ఎవరితో