పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108 బిల్వమంగళ [అం 5

                        ఉరులజిక్కియు స్రుక్కి ♦ ఉరుమనో ధైర్య
                                 మును విడనాడి, సత ♦ మును నిన్ను గొల్చి,
                        భ్రాంతులై, వ్యామోహ ♦ ధ్వాంతమున బడిరి.
                                 శఠుడవు నీవు వం ♦ చకుడవుగాన,
                        మొదలంట ఖండింతు ♦ సదయులను నింక
                                 వంచింపనేరవు ♦ క్రించుదనమునను;
                        పాపంబు తొలగ గో ♦ పాలుని కరుణ
                                 వర్షించు, చేకూరు ♦ హర్ష మనిశంబు,
                        నినుద్రుంప జను పాప ♦ నిచయ, మటుపైని
                                 పతితురాలని బ్రోచు ♦ పతితపావనుడు.

(గోపాలుడు వచ్చును)

గోపా - చాల్చాలు! కేశపాశము నేల ఖండిస్తావు? వద్దు, వద్దు.

చింతా - ఎవ్వ డీ బుడుతడు? వీనిని చూస్తే కళ్లు చల్లనౌతున్నవి.

గోపా - నీవేనా కృష్ణనామస్మరణ చేసినావు?... మాటాడవేమి?...నేనుపోతాను.

చింతా - నీ వెవడవు?

గోపా - నీకు మర్యాద తెలియదు. "ఎవడవు నాయనా?" అనవలెను...అప్పుడు నీతో మాటలాడుతాను.

చింతా - ఎవరి బాలుడవు నాయనా? నిన్ను చూడగానే నాహృదయమున దడ పోయి మనస్సు కుదుటబడ్డది ....ఒక్క