పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదో అంకము

________

మొదటి రంగము

(బృందావనమున గోవర్ధనగిరి ప్రాంతము)

చింతా - లోగడ ఆత్మవంచన చేయడమునకు నీ వెన్నో వేషములు వేసినావు. శ్రీ కృష్ణు కృపారసము నీపైని వర్షించడాని కెట్టి వేషము వేయవలెనో ఎరుగుదువా ? మా నవులను వశపర్చుకోవడమునకు స్వర్ణాలంకారములను ధరించవలెను, చిత్తమును పాపపంకిల మొనర్చవలెను. ఇప్పుడో, వాటితో పనిసరి. ఇకను విభూతిధారణమే శరణ్యము. లేకుంటే శ్రీ కృష్ణుని కృపకు పాత్రురాలవు కావు - ఇట్టి సుందర పవిత్రాంగలేపన మిదివర కెరుగవు. (పులుము కొనును)

                      వేషభూషణముల ♦ వేడబము చెల్లె,
                                  కేశపాశమ ! యికను ♦ కికురింప గలవె ?
                      నాదు మిత్రుడవని ♦ నన్ను వంచించి,
                                  అందకాళ్ళకు మోద ♦ మందజేసితివి,