పుట:Bible Sametalu 2.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బైబులు సామెత ఇదే భావాన్ని తెలియజేన్తున్నది. దుష్టునిలో దుష్ట స్వభావమే ఉంటుంది కనుట అతడు మంచి పనులలో కూడా తప్పులను, దోషాలనే వెదుకు తుంటాడు. ఋజుమార్గంలో ఆలోచించడం అతనికి చేతకాదు. 'దుష్టుడు తన దుష్ట స్వభావాన్ని అనునరించి దుర్విషయాలను తెలియజేస్తాడని' ఇంకొక బైబులు సామెత వాడుకటలోకి వచ్చింది. ఈ బైబులు సామెత కటూడా తెలుగు సామెతకు నమానమైన భావాన్నే తెలియజేన్తుంది. దృష్టివ మారితే అన్నీ మార్పుచెందుతాయి. దేనికైనా హృదయమే ఉనికిపట్టు. కాబట్టి మత్సరగ్రన్తులైన వారందరూ ఇదే భావాన్ని ప్రదర్శిస్తారు. కాగా 'నక్కలు బొక్కలు వెదకును' అనే తెలుగు సామెత, 'దుష్టుడు మంచి పనులలో కూడా తప్పు పట్టును' అనే బైబులు సామెత నమతుల్యమైనవి. 12 తెలుగు సామెత : పాలుపోసి పెంచినా పాము కరవక మానదు బైబులు సామెత : దుష్టులకు దయచూపినా వారు నీతిని నేర్చుకొనరు (యెషయా 26:10) బొగ్గును పాలతో కటడిగినా నలుపు పోదు. ఎలుక తోలును ఎందాక ఉదికినా తెలుపు రాదు. ఇవి స్వాభావికంగా వచ్చిన శాశ్వత గుణాలు. అదే విధంగా పాము విషపూరితమైనది. ఇతరులను కరిచి గాయపరచడమే దాని సహజ న్వభావం. దుష్టునికి ఎంత మేలు చేనినా మనకు కీడే చేస్తాడు తప్ప మేలు చేయడు. ఈ భావాన్ని వివరించడానికి ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తారు. 'విద్యచే భూషితుండయి వెలయుచున్న, తొడరి వర్జింపనగు నుమీ దుర్జనుండు, చారుమాణిక్య భూషిత శన్తమన్తకటంబైన పన్నగము భ'యంకటరము కాదే' అంటాడు భర్తృహరి భావాలను తెలుగులో వెలయించిన ఏనుగు లక్షణ కవి. కాపువాడు, పాము కటథ ఒకటుంది. ఒక కాపు సాయంకాలం పూట పొలానికి పోతాడు. వర్షం, చలిగాలి! అయినా పొలాన్ని చూచి రావడానికి వెళ్లాడు. అట్కడొక పాము చలికి వణకటుతూ బాధపడుతూ ప్రాణాపాయన్థితిలో ఉంది. పాపం, కాపువానికి జాలివేని, పామును తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. పాలు పోని పెంచాడు. పాము

111