పుట:Bible Sametalu 2.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుష్టుడు అహంకరించి ఊరంతటినీ పీడిన్తూ విశృంఖల విహారం గావిన్తుంటాడు. అలాటివాడికి బుద్ధి నేర్పబూనుతుంటే ఎంతటి వారన్నది చూడకుండా వారిమీదే తిరగబడి దుర్భాషలాడడం వాడి నైజం.

     'చాకి కోకలుదికి చీకాకుపడజేని
      మైల దీని లెస్స మడచినట్లు
      బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా'
      అంటూ వేమన పలికిన హితవులు మూర్ఖులకు రుచించవు.
    సుయోధనుని కొలువులో విదురాది నీతికోవిదులు, భీష్మాది కరువృద్ధులు, ద్రోణాది గురుపుంగవులు ఎంతమంది హితవు పలికినా, వాసుదేవుడు పనిగట్టుకుని వచ్చి హెచ్చరించినా వారికి కంరశోష, తిరస్కారమే మిగిలింది.
   తెలుగు సామెత ఇలాటివారిని మందలించడం వ్యర్థమనీ, పైగా అది మందలించబూనుకున్న వానినే నవ్వులపాలు చేన్తుందనీ బహు నిష్కర్షగా, నిశితంగా తెలుపుతున్నది. బైబులు సామెత కూడా దుష్టుని క్షేమమాశించి నాలుగు మంచి మాటలు చెబితే మనకే తలవంపులు ఎదురవుతాయనే లోక ప్రసిద్ధ సత్యాన్ని సూటిగా వ్యక్తపరచింది.
   ముళ్ళ కంచెపై మేలిమి చీనీ చీనాంబరాన్ని ఆరవేన్తే దానిని తిరిగి తీనే నమయంలో అది చినగక మానదు. నీటిలో కొట్టుకుపోయే తేలును చేతులతో రక్షించడానికి ప్రయత్నిన్తే అది కుట్టట మానదు. అలానే మూర్ఖుని మనన్సు రంజింపజేయాలనే సదుద్దేశంతో నుద్దులు పలుకబూనుకుంటే అవమానం తప్పదు.
   తెలుగు సామెత మూర్ఖుని జోలికి వెళితే అవమానం కలుగుతుందని చెబితే, బైబులు సామెత మూర్ఖునికి మంచి చేయబోయినా అవమానం కలుగుతుందని చెబుతున్నది. మంచికిపోతే చెడు ఎదురయిందన్నటు దుర్మార్గునికి హితవు చెప్పబోతే మనకి మిగిలేది తిరస్కారమే. మేలుకోరి పూనుకుని అజ్ఞానిని మంచి మార్గంలోనికి తేవాలని పోయినవాడు చెంపలు వేసుకొనే పరిన్థితి వన్తుంది. 'పోగాలము దాపురించిన వాడు కనడు, వినడు, మూర్కొనడు' అని నీతిచంద్రికట నూక్తి. రావణబ్రహ కొలువులో
                         96