పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూదితు దేవుని న్యాయాన్నీ కరుణనీ ఈలా స్తుతించింది
నీవు సైనికులు సంఖ్యపైనగానీ
బలాఢ్యుల బలంపైన గాని ఆధారపడవు
నీవు వినయవంతుల దేవుడవు
పీడితులకు సహాయుడవు
దుర్భలులకు అండగా వుండేవాడవు
నిరాశ్రయులకు ఆశ్రయుడవు
నిరాశ చెందినవారికి ఆదరువవు - 9,11

బానిసలకు స్వేచ్చనీయడం గొప్ప దయ. యూదితు ఆలా చేసింది. "ఆమె చనిపోకముందు తన యాస్తిని తన దగ్గరి చుట్టాలకూ పెనిమిటి బంధువులకూ పంచియిచ్చింది. తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదించింది" -16, 23-24 ఈ సందర్భంలో సీరా గ్రంథంకూడ ఈలా చెప్తుంది.

చిత్తశుద్ధితో పనిచేసే బానిసకుగాని
పూర్ణహృదయంతో శ్రమజేసే కూలివానికిగాని హాని చేయవద్దు
బుద్ధిమంతుడైన బానిసను
ఆత్మసమునిగా యెంచి అభిమానించు
అతనికి స్వాతంత్ర్యం దయచేయి - 7, 20-21

యజమానుడు తనకు కూలిచేసినవానికి వెంటనే కూలి చెల్లించాలి
నీవు పేదవాని బ్రతుకుతెరువును చెడగొట్టవద్దు
అతిన్ని ఆదుకొనడంలో ఆలస్యం చేయవద్దు - సీరా 41

ఈ సందర్భంలో తోబీతు తన కుమారుడు తోబీయాకు ఈలా చెప్పాడు. "నీకు పనిచేసినవారి కూలిని ఏరోజుకారోజు చెల్లించాలేగాని మరుసటిదినం వరకు అట్టిపెట్టుకోరాదు. నీవు ఈ నియమాన్ని పాటించి దేవుని గౌరవిస్తే అతడు నిన్ను బహూకరిస్తాడు" - 4,14.

మనం పేదసాదలను కాపాడాలని చెప్పూ సామెతల గ్రంథంకూడ ఈలా వాకొంటుంది

నీవు నోరులేనివారి పక్షాన మాటలాడు
నిస్సహాయుల కోపు తీసికో
అనాథుల పక్షాన వాదించు
వారికి న్యాయం కలిగేలా తీర్పుచెప్ప