పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేదసాదలను అక్కరలోవున్న వారిని ఆదరించు వారి హక్కులను నిలబెట్టు – 31, 8-9

ఈ సాంఘిక న్యాయాన్నిగూర్చి తోబీతు గ్రంథం సంగ్రహంగా ఈలా వాకొంటుంది. "ఇతరులు ఏలాంటి కార్యంచేస్తే నీకు అప్రియం కలుగుతుందో ఆలాంటి కార్యాన్ని నీవు ఇతరులకు చేయవద్దు. " - 4, 15.

6. విజ్ఞానం

జ్ఞానగ్రంథాలు చాలా తావులో విజ్ఞానాన్ని గూర్చి మాట్లాడతాయి. కనుక మనం దాని స్వభావాన్ని కొంతవరకైనా గ్రహించి వుండాలి. ఇక్కడ జ్ఞానాన్ని గూర్చి ఐదంశాలు పరిశీలిద్దాం.

1) ఈ రచయితలు జ్ఞానానికి ఆతిధేయ, భార్య వధువు, తల్లి అనే నానా వపమానాలు వాడారు.

ఆమె ఆతిధేయమై నరులను తన అన్నపానీయాలు పుచ్చుకోవడానికి రమ్మని ఆహ్వానిస్తుంది, ఈ యన్నపానీయాలు విజ్ఞాన బోదలే.

రా, నేను తయారుచేసిన భోజనాన్ని ఆరగించు
నేను సిద్ధంజేసిన ద్రాక్షాసవాన్ని సేవించు
మూర్ఖత్వాన్ని విడనాడితే నీవు బ్రతికిపోతావు
నీవు విజ్ఞానపధాన నడవాలి - సామె 9,5-6
నన్నభిలషించేవాళ్ళంతా నా చెంతకు రండి
మీ యాకలి తీర నా ఫలాలను భుజించండి
మీరు నన్ను స్మరించుకోగా నేను మీకు
తేనెకంటె తీయగా వుంటాను
నన్ను భుజించేవాళ్లు మరి యధికంగా భుజింపగోరుతారు
నన్నుపానం చేసేవాళ్ళు మరి యధికంగా పానంజేయగోరుతారు

- సీరా 4, 19-21

ఆమె తల్లిలా, ఎలప్రాయపు వధువులా వచ్చి భక్తనికి విజ్ఞానాన్నం పెడుతుంది
దైవభీతి కలవానిని ఆహ్వానిస్తుంది
అతనికి తెలివిడి అనే అన్నం పెడుతుంది
వివేకం అనే పానీయం అందిస్తుంది - సీరా 15,2-3