పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. మొదట నామానుకి యావే ప్రభువుపట్ల విశ్వాసమూ వినయమూ లేవు. సేవకులు యోర్గానులో మునగమని బతిమాలడంద్వారా అతనికి ఆ గుణాలు అలవడ్డాయి. నేడు మనకుగూడ విశ్వాసమూ వినయమూ వుంటేనేగాని దేవుడు మన యిబ్బందుల్లో మనలను ఆదుకోడు. లూకా 4,27లో క్రీస్తు నామాను విశ్వాసాన్ని ల్లాఘించాడు. మనకు కూడ ఆ గుణం అలవడాలని వేడుకొందాం.

3. దురాశ ఘోరమైన పాపం. ఈ దుర్గుణం గేహసీని నాశంచేసింది. ఈ దుర్గుణం వల్లనే ఆకాను (యెహోషువా7) యూదా, అననీయా సఫీరా మొదలైనవాళ్ళంతా చెడారు. వీళ్ళ తమ ఆత్మను ధనానికి అమ్ముకొన్నారు. డబ్బు, పదవి, తిండి మొదలైనవాటిని పురస్కరించుకొని మనం కూడ అత్యాశకు లొంగిపోతూంటాం. ఈ దుర్గుణానికి వశులం గాకుండా వుండాలని ప్రభవుని అడుగుకొందాం.

4. నామాను యోర్గాను నదిలో మునిగి శుద్దుడయ్యాడు. నేడు మనం వేదగ్రంథ పఠనం దేవద్రవ్యానుమానాలు, ప్రార్ధనం, సోదరప్రేమ సేవ మొదలైన పుణ్యకార్యాల్లో మునిగి శుద్దులం కావాలి. ఈ భాగ్యం కొరకు ప్రభువుని వేడుకొందాం.

17. సౌలు పరివర్తనం

అ.చ.9,1-19

1. సందర్భం

సైఫనుని రాళ్ళతో కొట్టి చంపించినవారిలో సౌలు కూడ ఒకడు. అతన్ని చంపేవాళ్ళు తమ బట్టలకు సౌలుని కాపలా వుంచారు. సైఫను చనిపోతూ తన శత్రువులకొరకు ప్రార్థించాడు. &9 ప్రార్థనా ఫలితంగా సౌలుకి పరివర్తనం కలిగింది. ఆ పరివర్తనం కథను లూకా ఈ యధ్యాయంలో వివరించాడు. అపోస్తలుల చర్యల (ѓбофо మొదట పేత్రు కథను వర్ణిస్తుంది. ఆ పిమ్మట 9వ అధ్యాయం నుండి గ్రంధాంతం వరకు సౌలు కథను వర్ణిస్తుంది. ఆ తొలి రోజుల్లో తిరుసభ అన్యజాతి ప్రజల్లో వ్యాపించడానికి ముఖ్యకారకుడు సౌలే, కనుక అతని కథ అందరూ పఠింపదగింది.

2. వివరణం

క్రీస్తు ఉత్థానానంతరం క్రైస్తవమతం యెరూషలేములో శ్రీప్రగతిని వ్యాపిస్తూంది. యూదుల ప్రధాన యాజకుడు క్రైస్తవ భక్తులను పట్టి చెరలో వేయండని ఆజ్ఞాపించాడు. అతనికి తోడ్పడిన వాళ్ళల్లో సౌలు ఒకడు. అతడు మొదట యెరూషలేములోని క్రైస్తవులను 'బంధించి చెరలో త్రోయించాడు. ఆ పిమ్మట డమస్కులోని క్రైస్తవులను గూడ బంధించాలని