పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాబుగూడ వ్రాసి పంపాడు. దానిలో అతడు నీవు నామాను కుష్ఠటను నయంచేయి అని యిప్రాయేలు రాజును ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో యిప్రాయేలు రాజ్యం సిరియాకు లొంగి వుందని చెప్పాంగదా! కావుననే శత్రురాజు అతన్ని అలా ఆజ్ఞాపించగలిగాడు.

యి(సాయేలు రాజు బెన్షదాదు లేఖను చదువుకొని నామాను కుష్ఠను నయంజేయడానికి నేనేమి దేవుణ్ణా యేమిటి అని గొణుగుకొన్నాడు. సిరియా రాజు ఈ కుంటిసాకుతో తనమీద యుద్ధానికి వస్తాడేమో అని భయపడ్డాడు. సంతాప సూచకంగా తనవంటిమీది బట్టలు నిలువన చించుకొన్నాడు.

ఎలీషా ప్రవక్తకు ఈ సంగతంతా తెలిసింది. యిప్రాయేలు రాజు తన ప్రవక్తద్వారా నామాను కుష్టను నయంజేయించాలని మాత్రమే బెన్లదాదు ఉద్దేశం. రాజే స్వయంగా వ్యాధి నయం చేయాలని అతని భావం కాదు. కనుక ప్రవక్త రాజునొద్దకు కబురంపి రోగిని తన చెంతకు పంపించమన్నాడు. లేఖలోని అపార్థం తొలగించాడు. దైవశక్తితో తానతనికి రోగవిముక్తి కలిగించగలనని చెప్పాడు. కనుక సైన్యాధిపతి రథమెక్కి అట్టహాసంగా ఎలీషా యింటికి వచ్చాడు.

నామాను తనంతట తానే యెలీషా యింటిదాకా వచ్చినా ఆ యింటిలో అడుగుపెట్టలేదు. ప్రవక్త బయటికి వచ్చి తన్ను ఆహ్వానించాలని అతని కోరిక, యెలీషాగూడ తన యింటిలోనుండి వెలుపలికి రాలేదు. సైన్యాధిపతే వినయంతో తన యింటిలోనికి రావాలని అతని వద్దేశం. ఇద్దరికీ బెట్టుసరి యొక్కువ.

కడన ప్రవక్త తన సేవకుణ్ణీ పంపి నీవు యోర్గానులో ఏడుసార్లు స్నానంచేయి అని సైన్యాధిపతికి చెప్పించాడు. నామాను పొగరు అణచాలనీ అతని విశ్వాసాన్ని పరీక్షించాలనీ గూడ ఎలీషా తలంపు. కాని ప్రవక్త తీరు సైన్యాధిపతికి నచ్చలేదు, అతడు ఈ ప్రవక్త వెలుపలికివచ్చి సాదరంగా నన్ను యింటిలోనికి ఆహ్వానిస్తాడనుకొన్నాను. కుష్ట సోకిన నా అవయవాలపై తన చేతిని త్రిప్పి తన దేవుని ప్రార్ధించి నాకు ఆరోగ్యదానం చేస్తాడనుకొన్నాను. అతడు ఈ పనులేవీ చేయలేదు. ఇప్పడు నన్ను వీళ్ళ యోర్గానునదిలో స్నానం చేయమంటున్నాడు. ఈ యేటి విలువెంత? మాదేశంలో ఇంతకంటె శ్రేష్టమైన నదులు లేవా? నేను వాటిల్లో మునిగి ఆరోగ్యం పొందలేనా? అని మండిపడుతూ అక్కడినుండి వెళ్ళిపోబోయాడు. ప్రవక్త వాక్కులోని శక్తి అతనికింకా అర్థంకాలేదు. అధికార గర్వంవలన అతనికి తల తిరిగింది.

అలా కోపంతో చిందులు తొక్కుతూ వెళ్ళిపోబోయే సైన్యాధిపతిని అతని సేవకులు వారించారు. అయ్యా! ప్రవక్త నినేదైనా కష్టమైన కార్యం చేయమంటే నీవు తప్పక చేసేవాడివి. ఇప్పడు అతడు సులభమైన కార్యం చేయమంటే చేయనంటావా అని మందలించారు. ఇక్కడ బైబులు రచయిత నామాను అహంకారానికి సేవకుల వినయ విశ్వాసాలకూ గల వ్యత్యాసాన్ని సృష్టంగా తెలియజేసాడు. ఏమైతేనేమి, సేవకుల మందలింపద్వారా నామానుకి విశ్వాసం కలిగింది. అతడు యోర్గానులో ఏడుసార్లు మునిగి శుద్ధిని పొందాడు. తన