పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధి కుదరడాన్ని చూచి తానే విస్తుపోయాడు. రోగవిముక్తివల్ల అతనిలో విశ్వాసం బలపడింది.

ఆరోగ్యాన్ని పొందిన నామాను ప్రవక్తకు వందనాలు చెప్పకుండా వుడాయించలేడు. అతని కృతజ్ఞతాభావం మెచ్చుకోదగింది. అతడు తాను కొలిచే హదాదు రిమ్మోను కాక, యావే ప్రభువు నిక్కమైన దైవమని నమ్మాడు. ఆ దేవుని శక్తితో తనకు మేలు చేసిన ప్రవక్తకు భక్తితో కానుకలు అర్పింపబోయాడు. కాని యెలీషా డబ్బుకి ఆశపడని దైవసేవకుడు. కనుక నాకు నీ కానుకలేమీ వదు. దైవశక్తి వల్ల నీకు ఆరోగ్యం కలిగింది. అదే చాలు. ఇక వెళ్ళిపో అన్నాడు.

నామాను, నేను మీ దేశంనుండి రెండు గాడిదలు మోసేంత మట్టిని మా దేశానికి తీసికొనిపోతానన్నాడు. ఈ మట్టి యిప్రాయేలు దేశానికి చిహ్నంగా వుంటుంది. దాని మీద అతడు బలిపీఠాన్ని నిర్మించి సిరియా దేశంలో యావేను పూజిస్తాడు. ఆ రోజుల్లో ప్రజలు ఒక్కోదేశం ఒక్కో దేవునికి చెందిందని భావించేవాళ్ళు కనుక ఏ దేశానికి అధిపతియైన దేవుణ్ణి ఆ దేశంలోనే కొలవాలి. సిరియాలో రిమ్మోనునీ యిస్రాయేలులో యావేనీ కొల్చేవాళ్ళ నామాను ఇప్పడు సిరియాలో యావేను కొల్వబోతున్నాడు. యావేపట్ల అతని నమ్మకం అంత గొప్పది.

ఐతే పండుగరోజున సిరియారాజు రిమ్మోను దేవళానికి వెళ్ళి ఆ దేవతకు మొక్కేవాడు. అతని వెంటనున్ననామానుకూడ ఆ దేవతకు మొక్కాలి. లేకపోతే మర్యాదగా వుండదు. కానీ ఇది సభ్యతవల్ల చేసే ఆరాధనకాని నిజమైన భక్తివల్ల చేసేదికాదు. ఈ వొక్క సందర్భంలోనే తాను చేసే విగ్రహారాధనకు ప్రవక్త తన్ను మన్నించాలని నామాను మనవి చేసాడు. ఎలీషా నామాను పరిస్థితిని అర్థం చేసికొని అతని విగ్రహారాధనను మన్నించాడు. అతడు వెళ్ళిపోయాడు. ఇంతవరకు నామాను కథ. అన్యజాతివాడూ విశ్వాసం లేనివాడూ ఐన నామాను రోగవిముక్తి కారణంగా పూర్ణహృదయంతో యావే ప్రభువును విశ్వసించాడు. ఇది యిక్కడ ముఖ్యాంశం.

ఇక గేహసీ కథ. ఇతడు ప్రవక్త శిష్యుడు. భవిష్యత్తులో ప్రవక్త కాబోయేవాడు. యూదభక్తుడు. కాని అన్యమతస్థుడైన నామానుకున్న భక్తివిశ్వాసాలు ఇతనికి లేవు. అతని ప్రధాన దురుణం దురాశ, గేహసీ అనే పేరుకి ఆసబోతు అని అర్ధం, ధనలోభంవల్ల నరుడు ఎంతగా పతనమైపోతాడో ఇతని కథ తెలియజేస్తుంది.

ఓ వైపున నామాను తెచ్చిన సొమ్మును చూడగానే గేహసీ కండ్లు జిగేలున మెరిసాయి. మరోవైపున ప్రవక్త ఆ సొమ్మను ముట్టకపోవడం అతనికి నిరాశ కలిగించింది. అతడు ప్రవక్త పేరుమీదిగా ఆ సొమ్ములో కొంత దక్కించుకోవాలనుకొన్నాడు. కనుక సైన్యాధిపతి రథం వెంట పరుగెత్తుకొనిపోయి అయ్యా! మా గురువుగారు పూర్వం నీ సొమ్ము ముట్టుకోలేదు. కాని యిప్పడు మనసు మార్చుకొన్నారు. తలవని తలంపుగా ఇద్దరు