పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఏలీయాలాంటి ఆధ్యాత్మిక నాయకులు మన ప్రజలకు ఎప్పుడూ అవసరమే. జనులు తెలియక దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. ఈ లోకమే, ఇక్కడి ఆకర్షణలే చాలు అనుకొంటారు. అలాంటివాళ్ళను నిరంతరమూ మళ్లా దేవుని దగ్గరికి తీసికొని వస్తూండాలి. మామూలుగా మన క్రైస్తవ సమాజంలో ఆధ్యాత్మిక నాయకులు గురువులు మరకన్యలు ఉపదేశులు ఉపాధ్యాయులు మొదలైనవాళ్లు. ఈ నాయకులు ఏలీయాలాంటి మహాభక్తులనుచూచి ప్రేరణం తెచ్చుకోవాలి. ఈ పాపపు లోకంలో ఆధ్యాత్మిక విలువలకు సాక్ష్యంగా నిలువాలి.


13. హోరేబు కొండమీద యేలీయా


1రాజు 19


1.సందర్భం

ఏలీయా బాలు ప్రవక్తలను చంపినందున యెసెబెలు రాణి అతనిమీద పగతీర్చుకోగోరింది. ప్రవక్త ఆ రాణికి దడిసి పారిపోయాడు. నిరుత్సాహంతో యావే మతాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఆపివేద్దామనుకొన్నాడు. చనిపోదామనికూడ తలంచాడు. హోరేబు కొండమీద ప్రభువు అతనికి దర్శనమిచ్చి ఓదార్చి తిరిగి పూర్వపు పనిమీద పంపాడు. జీవితంలో కష్టాలనూ ఆటంకాలనూ ఎదుర్కొని నిరుత్సాహం చెందేవాళ్ళకు ఏలీయా విషాదగాథ ప్రేరణం పట్టిస్తుంది.


2. వివరణం

బాలు ప్రవక్తలు ఓడిపోవడం, అద్భుతంగా వాన కురవడం అహాబు చూచాడు. ఐనా అతడు బాలు మతాన్ని విడనాడలేదు. యెసెబెలు రాణి ఏలీయాను 24 గంటల్లోనే చంపిస్తానని శపథం చేసింది. యావేపట్ల యిస్రాయొలీయుల విశ్వాసం చూద్దామా అంటే అదీ అంతంతమాత్రమే. అసలు వాళ్ళ నమ్మతగినవాళ్ళు కాదు. కనుక అతడు ప్రాణాలు కాపాడుకోగోరి యెసెయేలు నుండి పారిపోయాడు.

ప్రవక్త నిరుత్సాహం చెందాడు. విషాదానికి గురయ్యాడు. బేర్షణ పట్టణం వరకు వెళ్ళి సేవకుణ్ణి అక్కడే వదలివేసి. శోకంతో నరుల సాహచర్యాన్ని వదలివేసి, ఆహారంకూడ మానివేసి, యాత్రికుడై ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ రేగుచెట్టుక్రింద చతికిలబడి ఆ తావలోనే ప్రాణాలు విడిస్తే బాగుంటుందికదా అనుకొన్నాడు. తన పూర్వులైన మోష సమూవేలు మొదలైన భక్తులంతా యావే మతాన్ని నిలబెట్టలేకపోయారు. కన్ను 184