పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూచేప్పటికల్లా మూరెడంత మబ్బు తునక కన్పించింది. కాని ఆ చిన్న మబ్బులో దేవుని హస్తం వుంది. కనుక అది అంతై యింతై మహా మేఘమై ఆకాశాన్నంతటినీ ఆవరించి కుంభవర్షం కురిపించింది. మూడేండ్ల తర్వాత దేశంలో కరువు తొలగిపోయింది. ఈ వానను కురిపించింది బాలుకాదు, యావే. బాలు వానదేవుడుగా ప్రసిద్ధిపొందినా శక్తి లేనివాడు. భూమ్యాకాశాలనూ ప్రకృతి శక్తులనూ నడిపించేదీ శాసించేదీ యావే ప్రభువు వొక్కడే.

అహాబుకి విషయం అర్థమైంది. యావే శక్తి బాలు అశక్తి తెలిసింది. అతడు రథమెక్కి ఆవానలోనే తన రాజధానియైన యె(సెయేలుకు తిరిగిపోయాడు. అంతలోనే ప్రభువు ఆత్మ ఏలీయాను ఆవేశించింది. అతడు మహావేగంగా పరుగెత్తి రాజు రథం కంటె ముందుగానే యొస్రెయోలుకు చేరుకున్నాడు. కర్మెలు కొండకీ ఈ నగరానికీ 17 మైళ్ళ దూరం. అంతదూరమూ అతడు ఆత్మశక్తితో పరుగెత్తాడు. అతడు వార్తావహుడుగా వెళ్లి బాలు వోడిపోయాడనీ యావే గెల్చాడనీ రాజధాని నగరంలోని పౌరులకు చాటిచెప్పాడు అనుకోవాలి.


3. ప్రార్ధనా భావాలు

1. ఏలీయా జీవితాంతం బాలు ఆరాధనను ఎదిరించి నిల్చిన భక్తుడు. ఏకైక హృదయంతో యావేను కొల్చినవాడు. ఈనాడు మనం బాలు దేవతనీ విగ్రహాలనూ కొలవం. కాని మన శోధన మరోరూపంలో వుంటుంది. మనం కొల్చేది లోకవస్తువుల్ని. ప్రభువు ఇద్దరు యజమానులను సేవించవద్దని ఆదేశించాడు. ఈ యిద్దరు యజమానులు దేవుడూ లోకవస్తువులూను - మత్త 6,24. మామూలుగా మనం కొల్చే లోకవస్తువులు సుఖభోగాలు డబ్బు పదవి అధికారం పేరుప్రతిష్టలు మొదలైనవి. నరులంతా వీటికోసమే ప్రాకులాడుతూంటారు. మనం వీటిల్లోపడి దేవుణ్ణి పూర్తిగా విస్మరిస్తాం. ఇంత అవివేకం మరొకటిలేదు.

2. ఏలీయాకు నిజదేవునిపట్ల వున్న ఆసక్తిని మనం ఎంతైనా మెచ్చుకోవాలి. యిస్రాయేలీయులు సీనాయి దగ్గర యావేతో నిబంధనం చేసికొన్నవాళ్లు, అతని ప్రజలు, అతన్ని పూజించే భక్తులు. ఐనా వాళ్లు మూరులై యావేను విడనాడి బాలు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళను మళ్ళా ప్రభువు దగ్గరికి రాబట్టిందాకా ఏలీయాకు విశ్రాంతి లేదు. యిస్రెయొలు దేశంలో యూవే మతాన్ని పునరుద్ధరించిందాకా అతనికి నిద్రలేదు. ప్రేషిత సేవలో మనకుకూడ ఈ ప్రవక్తకున్న ఆసక్తి వుండాలి. ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసికొని వచ్చిందాకా మనంకూడ నిద్రపోకూడదు.