పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వం మోషేకూడ యిస్రాయేలు ప్రజలను సీనాయి కొండదగ్గర ప్రోగుజేసి అక్కడ ఓ బలిపీఠాన్ని కట్టించాడు. కోడె నెత్తుటిని ఆ బలిపీఠం మీద చల్లి దేవునితో నిబంధనం చేయించాడు - నిర్ల 24,4-8. కనుక ఇక్కడ కర్మెలు కొండమీది యేలీయా ఆ సీనాయి కొండమీది మోషేను జ్ఞప్తికి తెస్తాడు.

ఏలీయా బాలు ప్రవక్తలకంటె భిన్నంగా జపించాడు. ప్రభూ! నీవు యిస్రాయేలుకి దేవుడివి. నీకొరకే నేను ఈ శ్రమంతా పడుతున్నాను. నా మొర ఆలించి అగ్నిని పంపు. అవిశ్వాసంతో నీ చెంతనుండి వెళ్ళిపోయిన ఈ ప్రజలను మళ్ళా నీ దగ్గరికి రాబట్టుకో అని మనవిచేసాడు. అతడు సంగ్రహంగాను నిమ్మళంగాను ప్రార్థించాడు. బాహ్యాడంబరం ఏమీ లేదు.

అది యిప్రాయేలీయులు సాయంకాలం ప్రభువుకి బలులు అర్పించే సమయం. ఏలీయా ప్రార్థన చేసాడో లేదో దేవుడు పంపిన అగ్నిదిగివచ్చి ఎద్దు మాంసాన్నీ కట్టెలనూ కందకంలోని నీటినీగూడ దహించి వేసింది. ఆ యగ్నినిజూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. సాష్ట్రాంగపడి దండం పెట్టారు. యావే ఒక్కడే నిక్కమైన దేవుడని అరచారు. దానితో దొంగ దేవుడెవరో యధార్థమైన దేవుడెవరో తేలిపోయింది. పోటీలో యావే గెల్చాడు.

బాలు ప్రవక్తలను పారిపోనీయకుండా పట్టుకొండని యేలీయా ప్రజలను ఆజ్ఞాపించాడు. వాళ్ళ 450 మందినీ బంధించారు. ఏలీయా వాళ్ళందరినీ వధించాడు. బాలు తన భక్తులను కాపాడలేకపోయాడు. నేడు మనం ఏలీయా అంతమందిని చంపటం హింసకాదా అని ప్రశ్నిస్తాం. కాని ఆ రోజుల్లో పరిస్థితి వేరు. యావే బాలు దేవరల మధ్య పోటీ యుద్ధంలాంటిది. ఆకాలంలో పోరులో గెల్చినవాళ్ళు ఓడిపోయినవాళ్ళను చంపేవాళ్ళ కనుక ఇక్కడ యావే భక్తులు బాలు భక్తులను చంపారు. ఇంకా, ప్రజలను అపమార్గం పట్టించే కపట ప్రవక్తలను పట్టి చంపివేయాలని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది -

ద్వితీ 13,5. ఏలీయా ఇక్కడ ఈ యాజ్ఞనుకూడ పాటించాడు.

బాలుతో పోటీ ముగిసింది. ప్రజలు దేవుడు పంపిన నిప్పనీ, కపట ప్రవక్తల నెత్తటినీ చూచి యావే వొక్కడే దేవుడని నమ్మారు. అతనివద్దకు తిరిగివచ్చారు. కాని అహాబు ఇంకా యావేచెంతకు తిరిగిరాలేదు. అతడు బాలు ఓటమిని చూసూ వూరకుండిపోయాడు. మరి.అతన్నిగూడ ప్రభువు దగ్గరికి రాబట్టడం ఏలా? వర్షంద్వారా.

కొండమీద బలి సమర్పిస్తున్నారు కనుక ఇంతవరకు అందరూ ఉపవాసం చేసారు. ఇప్పడు ఆ బలి ముగిసింది. కనుక ప్రవక్త రాజుతో నీవువెళ్ళి భోజనం చేయవచ్చు అని చెప్పాడు. తానేమో తలను కాళ్ళమధ్య పెట్టుకొని గాఢమైన ప్రార్థనలో మునిగిపోయాడు. ఆ ప్రార్ధనం వానకొరకే.

అతడు సేవకునితో నీవు సముద్రంవైపు పారజూడు. మజేమైనా లేచిందేమో చూడు అన్నాడు, సేవకుడు ఆరుసార్లు సాగరంవైపు చూచినా మేఘమేమీ కన్పించలేదు. కాని ఏడవసారి