పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోబీతు తన కొడుకు తోబియాకు ఈలా సలహా యిచ్చాడు. "నాయనా! నీ జీవితంలో ప్రతిదినం ప్రభువుని గుర్తుంచుకో. ఏనాడూ పాపం చేయకు. దేవుని ఆజ్ఞ మీరకు. ఎప్పడూ సత్కార్యాలే చేయి. దుష్కార్యాలు మానుకో. నీవు సత్యవర్తనుడవైతే ప్రతికార్యంలోను నీకు విజయం చేకూరుతుంది” - తోబీ 4, 5-6. ఈ వాక్యాలు మనంకూడ పాటించదగ్గవి కదా!

ప్రశ్నలు

1. విజ్ఞానం అంటే యేమిటి? బైబులు విజ్ఞానానికీ మన దేశంలో పుట్టిన విజ్ఞానానికీ తేడాయేమిటి? రోజువారి జీవితంలో విజ్ఞానం ప్రాముఖ్య మేమిటి? 2. నరులు చేసే మంచి చెడ్డలకు బహుమానమూ శిక్షా వున్నాయి - వివరించండి. 3. దానప్రాశస్త్యాన్ని తెలియజేయండి. 4. జ్ఞాన గ్రంథాలు పేర్కొనే సాంఘిక న్యాయాన్ని విశదీకరించండి. 5. విజ్ఞానాన్ని గూర్చిన ఐదంశాలను తెలియజేయండి. 6. పొదుపు, నిజాయితీ, నమ్మదగినతనం అనే మూడు నైతిక గుణాలను వివరించండి. 7. జ్ఞానగ్రంథాలు వర్ణించే దైవభక్తిని విశదీకరించండి. 8. స్నేహధర్మాలను పేర్కొనండి. 9. విజ్ఞానబోధల్లో తగిలే వివాహధర్మాలను విశదీకరించండి. 10. పెద్దలపట్ల గౌరవం జూపే తీరును తెలియజేయండి. 11. దుషులేలాంటివాళ్ళో సజ్జను లేలాంటివాళ్ళో తెలియజేయండి. 12. ఈ జీవితం అశాశ్వతం - వివరించండి. 13. మృత్యుస్మరణను విశదీకరించండి. 14 వాక్పారుష్యాన్ని వివరించండి. 15. సోమరితనాన్ని వివరించండి. 16. తిండిపోతుతనాన్ని గూర్చి తెలియజేయండి. 17. వ్యభిచారాన్నీ కామవికారాన్నీ గూర్చిన విజ్ఞాన బోధలను ఉదాహరించండి. 18. గర్వంతో పాపం ప్రారంభమైంది - వివరించండి. 19. జ్ఞానగ్రంధాలు విగ్రహాల కొలువును నిరసించిన తీరును తెలియజేయండి. 20. పాపాన్ని ఎందుకు మానుకోవాలి?