పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా నోటికి ఎవరైన కావలి వండి విజ్ఞతతో నా పెదవులను మూయిస్తే ఎంత బాగుంటుంది! అప్పడు నేను తప్పలు చేయను నా జిహ్వ నన్ను నాశం చేయదు. నాకు తండ్రివీ నా జీవానికి కర్తవూ ఐన ప్రభూ! నేను నా జిహ్వకు లోపడకుండా వుండేలానూ, నా నాలుక నన్ను నాశంచేయకుండా వుండేలానూ, అనుగ్రహించు - సీరా 27, 27. 23, 1.

26. ప్రేమలేని జీవితం వ్యర్థం

      మనకు బడుగువర్గాలమీద ప్రేమ వుండాలి. బిచ్చగాడు దానం చేయమని అడిగితే మొగం ప్రక్కకు త్రిప్పకోకూడదు. అప్పడతడు మనలను శపించవచ్చు. పిసినిగొట్టయిన వాడు తాను తినడు, ఇతరులకు పెట్టడు.లోభివాని ఆశకు అంతంలేదు. ప్రియవాక్కులతో దానం చేయాలే గాని తిడుతూ ఈయకూడదు.
     బిచ్చగాడు యాచిస్తే నిరాకరింపకు
     పేదవానినుండి మొగం ప్రక్కకు తిప్పుకోకు
     దరిద్రునినుండి చూపు మరల్చకు
     అతడు నిన్ను శపించకుండా వుండేలా చూచుకో
     హృదయవేదన భరించలేక ఆ పేదవాడు నిన్ను శపిస్తే
     ప్రభువు అతని మొర ఆలిస్తాడు
     పిసినిగొట్టుకి సిరిసంపదలు తగవు
    లోభికి ధనంతో ఏమి ప్రయోజనం?
    తాననుభవింపక సొమ్ము కూడబెట్టేవాడు
    ఇతరుల కొరకే కూడబెడుతున్నాడు
    అతని సొత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుతారు
    తనకొరకు తాను ఖర్చుజేసికోనివానికంటె
    నికృష్ణుడు లేడు
    పిసినిగొట్టుతనం తన శిక్షను తానే తెచ్చుకొంటుంది
   లోభియైన నరుడు దుష్దుడు
   అక్కరలో వున్నవారిని ఆదుకొనడు