పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు తనకున్నదానితో తృప్తిజెందడు దురాశ వలన అతని హృదయం కుదించుకపోతుంది నాయనా! నీవు దానం చేసేపుడ నిందావాక్యాలు పలుకవద్దు ఇతరులకు ఇచ్చేపుడు మనసు నొప్పించవద్దు మంచు కురిసినప్పడు ఎండ వేడిమి సమసిపోతుంది కదా! నీవిచ్చే వస్తువులకంటెగూడ నీ మాటలు ముఖ్యం కరుణామయ వాక్యాలు ప్రశస్త దానంకంటె శ్రేష్టమైనవి కాని ఉదార స్వభావుడు ఆ రెండిటినీ యిస్తాడు - సీరా 4,4-6.13,3-4.6-9. 18, 15-17.

27. కొన్ని దురుణాలు

        మన జీవితంలో చిన్నచిన్న దుర్గుణాలు చాలవుంటాయి. వాటిని గూడ సవరించుకోవాలి. మనం వెలుపలి డాబును లెక్కచేయకూడదు. అనుచితమైన కోపం పనికిరాదు. పేదవాణ్ణి పీడించి అవమానిస్తే అతన్ని చేసిన దేవుణ్ణేఅవమానించినట్లు.
       అందంగా వున్నందువలన ఎవరినీ మెచ్చుకోకు
       అందంగా లేనందువలన ఎవరినీ నిరాకరింపకు
       రెక్కలతో ఎగిరే జీవుల్లో తేనెటీగ చాల చిన్నది
       కాని దాని తేనె మహామధురంగా వుంటుంది
       నీ నాణెమైన దుస్తులను జూచుకొని మురిసిపోవద్దు
       గౌరవం అబ్బినపుడు పొగరుబోతువి కావద్దు.
       అనుచితమైన కోపం తగదు
       అది కోపిష్టినే నాశం చేస్తుంది
       సహనవంతుడు తగిన సమయం కొరకు
       ఓపికతో వేచివుంటాడు
       కడన అతడు సంతోషం చెందుతాడు.
       దేవుడు నరులు కోపించాలని కోరుకోడు
       కనుక నరులు ఉగ్రులు కాకూడదు

113