పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రావాలి. కాని ఆమె అపవిత్రురాలైతే క్రీస్తు ఆమె గర్భంలోకి అడుగు పెడతాడా? అంచేత ఆ దేవునిలాగే ఆమెకూడ పరిశుదురాలు కావాలి గదా? కనుకనే పిత ఆమెను ఓ దేవాలయంలాగా పరిశుద్ధపరచాడు. మరియు దేహాత్మలను పవిత్రపరచి ఆ మాతృమూర్తిని క్రీస్తుకు యోగ్యమైన వాసస్థలమయ్యేలా తీర్చిదిద్దాడు. ఆ మంగళమూర్తి క్రీస్తుని తన హృదయంలో నిలుపుకున్న ఓ పవిత్రదేవాలయం, "ప్రభూ! నీ మందిరానికి పారిశుధ్యం తగివుంటుంది" అంటాడు కీర్తనకారుడు - 93,5. ఔను, మరియకు పారిశుధ్యం తగివుంటుంది.

మరియు పిశాచం తలను చిదుకగొట్టబోతుంది - ఆది 3,15. ఈలా సైతానుని జయించే కన్య తానే పాపంద్వారా ఆ సైతానునికి దాసురాలు కాకూడదుగదా? కనుక ఆమెకు పుట్టువునుండీ పాపం సోకలేదు.

దేవదూత ఆ మరియతో "పవిత్రాత్మ నీ మీదికి దిగి వస్తుంది. మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది" అంటాడు - లూకా 1, 36. ఈ దివ్యాత్ముడు చాల గొప్ప గొప్పచిత్రకారుడు. చిత్రకారుడు సుందరిని చిత్రించినట్లుగా పరిశుద్ధాత్మడు తనవధువైన మరియమాతను సుందరంగా, పవిత్రంగా తీర్చిదిద్దాడు. ఆమెను అన్ని అలంకరణలతో, అన్ని సౌభాగ్యాలతో, అన్ని పుణ్యాలతో ఓ నిర్మల వధువునులాగ అలంకరించాడు. కావననే ఆ కన్య పాపకళంకం సోకని సంపూర్ణ సౌందర్యవతి. దేవుడు మరిమాతను పాపం నుండి పదిలపరచడంలో, ఓ కల్యాణమూర్తినిగా ఆమెను తీర్చిదిద్దడంలో భావం ఇది.

3. నిష్కళంకమాత మహిమ

జన్మ కర్మపాపాలనుండి విముక్తయైనందున మరియమాతకు సిద్ధించిన మహిమ అంతింతకాదు. ఆమె పితకు ప్రియ కుమారి, సుతునకు ప్రియజనని, పరిశుద్ధాత్మనకు ప్రియవధువు ఔతుంది. పాపపు ప్రపంచాన్నుండి వైదొలగి పవిత్రుడైన భగవంతునికి అంకిత మౌతుంది. ఈ లోకంలో ఇద్దరే యిద్దరు పవిత్రులు. క్రీస్తు, క్రీస్తు మాతయైన మరియూ.

ప్రాచీన క్రైస్తవ వేదశాస్త్రజ్ఞలు మరియను చాలా ఉపమానాలతో స్తుతించారు. పూర్వవేద మందసపకొయ్య చెడిపోకుండా వుండేది. పాపకళంకం సోకని మరియకూడ ఈ మందసపు కొయ్యలాగ చెరుపు నెరగనిది. ఆదామేవలను వెళ్ళగొట్టాక ప్రభువు శృంగారవనాన్ని సురక్షితం చేసి కాపాడాడు. మరియకూడ సురక్షితమైన శృంగారవనం వంటిది. ఆమె మెరపుతో గూడుకొన్న మేఘం లాంటిది. ఉషస్సుతో నిండిన ఆకాశం లాంటిది. ఈమెరపూ, ఈ ఉషస్సు ఆమె కన్న క్రీస్తే .ఈ పనీతరురాలు పాపపు నరజాతిలో