పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు ఆమెను నీతివస్త్రంతో ఓ వధువునులాగ అలంకరించాడు. వరప్రసాదాలనే ఆభరణాలతో కైసేసాడు. మరియు దేవదూతలకంటె పునీతుల కంటెగూడ అధిక వరప్రసాదాలతో నిండిపోయింది. కాపుననే శ్రీసభ తన ఆరాధనలో ఆ నిర్మలహృదయను కొనియాడుతూ "ఓ మరియా! నీవు పరిపూర్ణ సౌందర్యవతివి. పాపదోషం నీ కేమాత్రమూ సోకలేదు" అంటూ పరమగీత వాక్యాన్నిఆమెకు అన్వయింపజేస్తుంది - 4, 1. ఏ ఘ్రేమా అనే నాల్గవ శతాబ్దపు భక్తుడు క్రీస్తు నుద్దేశించి "ప్రభూ! నీలో పాపదోషమంటూలేదు, మీ తల్లిలో కల్మషమంటూ లేదు" అని వాకొన్నాడు. ఆ భక్తుడే మరోతావులో "దైవవార్త దైవవక్షస్సును వీడి కన్యవక్షస్సు నాశ్రయించి మానవరూపం చేకొంది. ఆదైవవక్షస్సులాగే ఈ కన్యవక్షస్సు కూడ పరమ పవిత్రమైంది. ఇక నేడు మన వక్షస్సున వసించే ప్రభువు స్తుతింపబడునుగాక” అంటాడు. కనుక మరియు పరమ పవిత్రురాలు. పాపమునుండి పదిలపరచబడిన పునీతురాలు. ఎన్మిదవ శతాబ్దంనాటికే క్రేస్తవ ప్రపంచంలో నిష్కళంకమాత ఉత్సవం ప్రచారంలో ఉండేది. 13వ శతాబ్దంలో డన్స్ స్కొటస్ అనే దైవ శాస్త్రజ్ఞడు మరియా నిష్కళంకగా జన్మించిందని రుజువపరచాడు. 1854లో పదవ భక్తినాధ పోపుగారు మరియు నిష్కళంకగా ఉద్భవించిందని అధికార పూర్వకంగా ప్రకటించారు.

2. మరియను ఈలా యెందుకు పదిలపరచాలి?

దేవుడు మరియను జన్మపాపంనుండీ కర్మపాపం నుండీ పదిలపరచాడన్నాం. ఎందుకు? తన తల్లిని తాను ఎన్నుకున్న నరుడు ఒక్కడే ఒక్కడు, క్రీస్తు. ఈలా తానెన్నుకున్న స్త్రీని క్రీస్తు తనకు యోగ్యమైన మాతనుగ తయారుజేసికొన్నాడు. తల్లి కళంకం బిడ్డకు సోకుతుంది. అంచేత జన్మాదినుండీ ఆమె యందు కళంకం ఉండకూడదు. దేవదూత ఆమెకు మంగళవార్తచెపూ "దైవానుగ్రహానికి ప్రాప్తరాలవైన మరియా! నీకు శుభం" అంటాడు-లూకా 1,28. అనగా ఆమె పట్టవునుండి దైవానుగ్రహంతో నిండివుండేదనే భావం. ఈలాంటి తల్లి మరియ. ఈ తల్లివలన క్రీస్తుకు చిన్నతనం కలుగలేదు. అందుకే శ్రీసభ ప్రార్థనలో ఉపయోగింపబడే ఓ గీతం క్రీస్తునుద్దేశించి "ప్రభూ! నీవు కన్యగర్భాన్ని అనాదరం చేయలేదు" అంటుంది. చక్కని ఇల్లు గట్టించి శత్రువు కిచ్చి వేయం. ప్రభువూ తన చక్కని తల్లిని, పిశాచం వశంజేసి పాపకళంకితను జేయడు. మంచిపండ్లు కాసేచెట్టు మంచిచెట్టు. మంచి గొర్రె పిల్లను ఈనిన గొర్రె మంచిగొర్రె, అలాగే పవిత్ర క్రీస్తును మనకందించిన మరియమాతగూడ పవిత్రురాలే.

బైబులు భగవంతుడు పరిశుద్ధుడు. అపవిత్రప్రాణి ఏదికూడ అతని సముఖంలోకి రాలేదు. ఇక మరియు పవిత్రుడైన దేవుణ్ణి మన మానుష కుటుంబంలోనికి తీసికొని