పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమెతో ఐక్యమైతేనేగాని అతడు తన సృష్ణ్యాశయాన్ని సాధించలేడు. బిడ్డల్ని కని సంతానరూపంలో తన జీవితాన్ని పొడిగించుకోలేడు. అంచేత అతడు నిత్యం ఆమెమీద ఆధారపడుతూ వుండాలి. ఆమె గృహిణి. కాని అతడు గృహపతి. ఆమెకు శిరస్సు, అధిపతి - 1కొరి 113. ఆమె అతని దేహాన్నుండి కలిగింపబడింది. ఆమె ఉనికి అతనికోసం. కావున స్త్రీ ఓ దేహంలాంటిది. ఆ దేహానికి శిరస్సులాంటివాడు పురుషుడు - ఎఫె 5,28. బైబుల్లో శిరస్సు ఆధిపత్యాన్ని నాయకత్వాన్ని సూచిస్తుంది. కావున స్త్రీపై ఆధిపత్యం చూపేవాడు పురుషుడు. గాని ఈ ఆధిపత్యం క్రీస్తు శ్రీసభపట్లచూపే ఆధిపత్యం లాంటిదేఎఫే 5,23. బైబుల్లో ఆధిపత్యం చూపడమనగా ఓ వ్యక్తిపై అధికారం చెలాయించడంకాదు. మరి ఆ వ్యక్తి శ్రేయస్సుకోసం పాటుపడ్డం; ప్రేమభావంతో ఆ వ్యక్తిని ఆదరించడం. క్రీస్తు శ్రీసభను ఇలా ఆదరించాడు. భర్తకూడ భార్యను యీలా ఆదరించాలి. వివాహజీవితంలో పురుషుడేమో అధిపతే, స్త్రీయేమో విధేయురాలే - ఎఫే 5,24. కాని యీ యాధిపత్య విధేయతలు ప్రేమ అనే పునాదిపై నిలవాలి.

4. ఆమె తల్లి, అతడు తండ్రి

స్త్రీ భార్యగా, తల్లిగా, సార్ధక్యం పొందుతుంది. కావున పురుషుడు ఆమెను భార్యగా స్వీకరించాలి. "నా బిడ్డల తల్లి" అన్న భావంతో ఆమెను గౌరవించాలి. బైబులు చివరి గ్రంథములోని s మగబిడ్డని గని మన్నన పొందుతుంది-దరు 12,5. రాహేలు బిడ్డలనీయమని భర్త యాకోబును పీడిస్తుంది - ఆది 30,1. యువకునికి భార్య దొరికినప్పుడు అన్ని మేలులూ కలిగినట్లే - సామె 18,22 ఆమె అతనికి సహాయకురాలు. వృద్దుడు ఊతకట్టమీదలా, అతడూ ఆమెమీద ఆనుకొని నడుస్తాడు. పక్షి గూటిలో నివసించినట్లు ఆమెతో కాపురం ఏర్పరచుకొని ఓ యింట్లో నివసిస్తాడు. ఓ యింటివాడు ఔతాడు - సీరా 37,24-26. ఆమె భార్య, తల్లి కాబోతుందన్నాం. అతడూ భర్త, తండ్రి కాబోయేవాడు. అతని తాతతండ్రులూ, అతనూ తన బిడ్డలయందు కొనసాగిపోతారు. తల్లిదండ్రులం కాబోతున్నాం అనే భావం యువతీయువకుల మనస్తత్వానికి లోతుతనాన్ని నిబ్బరపు గుణాన్ని ఇస్తుంది.

5. కన్య-గురువు

ఇంతవరకూ పూర్వవేదం సూచించిన భావాలు చూచాం. కాని నూత్నవేదం స్త్రీ విషయంలో మరో గొప్ప ఆదర్శాన్నిగూడ సూచించింది. ఆమె భార్యగా, తల్లిగా మాత్రమేగాక