పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసికొని అతన్ని సంతోషపెట్టడంలో పెద్ద సిలువవుంటుంది. ఈ సిలువను దంపతులు మోయక తప్పదు. ఆత్మార్పణంలేందే ప్రేమలేదు. స్నేహితుని కొరకు ప్రాణాలు అర్పించడంకంటె గొప్ప ప్రేమ ఏముంటుంది? -యోహా 15, 13 ఇదే సిలువ. ఆత్మార్పణం రూపంలో వుండే ఈ సిలువను దంపతులిద్దరూ మోరియాలి. స్వార్ధాన్ని జయించి తన్నుతాను నిరాకరించుకొంటేనేగాని స్త్రీపురుషులు నిజమైన దాంపత్యజీవితం గడపలేరు.

1. లైంగికరంగంలో సిలువలు

వివాహజీవితంలో శృంగారం వుండవలసిందే. కాని దీనికి సంయమనం అవసరం. భార్య మేలుకోరి భర్త, భర్తమేలుకోరి భార్య లైంగికక్రియను మానుకోవాలి. వ్యాధిబాధలకు గురికావడం, మనోధర్మాలు వికటించి వుండడం మొదలైన సందర్భాల్లో దంపతుల్లో వొకరు లైంగికక్రియకు సమ్మతింపకపోవచ్చు. అప్పడు రెండవవ్యక్తి తన భాగస్వామిని నిర్బంధం చేయకూడదు. నిగ్రహాన్ని పాటించాలి. ఇది పెద్ద సిలువ. ఐనా ఆలుమగలు దీన్ని మోయకతప్పదు. ఒకోసారి ఈ నిగ్రహాన్ని చాలకాలం పాటింపవలసి వుంటుంది. ఈ సందర్భంలో దంపతుల భావన "నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. కనుక నీవు అంగీకరించని దానిని గూర్చి నేను నిన్ను నిర్బంధం చేయను" అన్నట్లుగా వండాలి.

పౌలు వివాహితులు అవివాహితులో అన్నట్లు జీవించాలని చెప్పాడు-1కొరి 729. ఇక్కడ వివాహితులు లైంగికక్రియను అసలు మానుకోవాలని పౌలు భావంకాదు. అతడు రెండవరాకడ సమీపంలో వుందని నమ్మాడు. కనుక దంపతులు లైంగిక వ్యాపారాలు మాని ఆధ్యాత్మిక విషయాలమీదికి మనసు త్రిప్పకోవాలని భావం. విశాలార్థంలో ఈ వాక్యం నేడు మనకుకూడ వర్తిస్తుంది. భగవంతుణ్ణి పూజించుకోవడానికీ, ప్రార్ధన చేసికోవడానికీ, దీనులకూ ఆపన్నులకూ సేవలు చేయడానికీ కొన్నిసార్లు లైంగిక వ్యాపారాలు మానుకోవలసివస్తుంది. ఈ సిలువను మోయడంద్వారా దంపతులు ఎంతో పుణ్యాన్ని ఆర్జిస్తారు.

ఇంతవరకు లైంగిక రంగాన్ని గూర్చి చెప్పాం. కాని వివాహజీవితంలో సిలువలు కేవలం ఈ రంగంలో మాత్రమేకాక ఇంకా అనేకరంగాల్లో రావచ్చు. ఇవి చాలా వున్నాయి.

2. ఇతర రంగాల్లో సిలువలు

వైవాహిక జీవితంలో పెద్ద సిలువలు వస్తుంటాయి. భార్యాభర్తలకు మనసు కుదరకపోవడం, చపలచిత్తంతో వివాహడ్రోహం చేయడం సిలువ. వ్యాధిబాధలు, తలవని తలంపుగా భర్తగాని భార్యగాని చనిపోవడం సిలువ, పిల్లలు మాట వినకపోవడం, ఒకోసారి