పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. క్రీస్తునాడు పాలస్తీనా దేశం రోమను సామ్రాజ్యం అధీనంలో ఉండేది. యూదులు రోమను ప్రభుత్వానికి కప్పం గట్టేవాళ్ల స్థానికంగా కొందరు యూదులు పాలస్తీనాలోని ఒక్కోమండలంలోను ఈ కప్పానికి పాటపాడేవాళ్ళ వాళ్ళ ప్రజలవద్దనుండి పెద్ద మొత్తాలు వసూలుజేసి వానిలో కొంత భాగంమాత్రమే రోమను ప్రభుత్వానికి ముట్టజెప్పేవాళ్ళు. మిగతాడబ్బు వాళ్లు కొట్టేసేవాళ్లు, ఈ కాయిదాదారులకే సుంకరులు అని పేరు. ఈ సుంకరులు చేసే మోసానికి వీళ్ళను "పాపాత్ములు" అని పిలిచేవాళ్లు, యెరికొమండలములోని సుంకరులకు నాయకుడు జక్కయ, ఓమారు ప్రభువు యెరికో పట్టణానికి వచ్చి జక్కయను సందర్శించాడు. దానితో అతనికి పశ్చాత్తాపం కలిగింది. అతడు తాను నోళ్ళగొట్టి సంపాదించిన సొత్తులో సగం పేదలకు దానం జేసాడు. పైగా ఎవరెవరికి వ్యక్తిగతంగా అన్యాయం చెసాడో వాళ్ళందరికి నాల్గవంతులు నష్టపరిహారంగూడ చెల్లించాడు. ప్రభువు అతని పశ్చాత్తాపానికి మెచ్చుకొని నేడు ఈ యింటికి రక్షణ లభించింది అని పల్కాడు - లూకా 19, 1-10.

9. పౌలు యూదుడుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించాడు. డమస్క త్రొవ లొ ప్రభువు ప్రత్యక్షం కాగా పౌలు మనసు మార్చుకొని క్రీస్తు శిష్యుడయ్యాడు. అతడు క్రీస్తుకు ఎంతో సేవ చేసాడు. కొరింతులాంటి గ్రీకు పట్టణాల్లో క్రైస్తవ సమాజాలు స్థాపించాడు. తీతు తిమోతీలవంటి శిష్యులను ప్రోగుజేసాడు. మహత్తరమైన భక్తిభావాలతో పదునాలు జాబులు వ్రాసాడు. ఇంతసేవ చేసినంక చివరిరోజుల్లో గూడ పౌలు తాను మహా పాపిననుకొని పశ్చాత్తాపపడ్డాడు. "పాపాత్ముల్లో నేను మొదటివాణ్ణి అయినా నాలాంటి పాపిని మన్నిస్తే ఇక భవిష్యత్తులో రాబోయే పాపాత్ములు నన్నుజూచి ధైర్యం తెచ్చుకొంటారనుకొని వాళ్ళకు ఆదర్శంగా ఉండడం కోసం ప్రభువు నన్ను మన్నించాడు" అని వ్రాసికొన్నాడు. ఈలా పౌలు తానెప్పడో క్రైస్తవులను హింసించినందుకు జీవితాంతమువరకూ పశ్చాత్తాపపడ్డాడు -1 తిమో 1. 50-16.

10.

1) పాపి మరణించడం వలన నాకు సంతోషం కలుగదు. అతడు మనసు మార్చుకొని బ్రతకడంవలన నాకు సంతోషం కలుగుతుంది - యెహె 23, 11.
2) దేవా! నాలో నిర్మల హృదయాన్ని సృజించు క్రొత్త అంతఃకరణాన్ని నాలో నెలకొల్పు నీ సన్నిధినుండి నన్ను గెంటివేయకు నీ పరిశుద్దాత్మను నాయొద్దనుండి తీసివేయకు - కీర్త51, 10-11 239 N