పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27. దయ

భగవంతునిలో కన్పించే ఓ. కల్యాణగుణం, దయ. ఆ భగవంతుణ్ణి చూచి నరుడుకూడ దయతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇతరులపట్ల ఖచ్చితంగా ప్రవర్తించడమూ, ఇతరులను ప్రమశిక్షణలో ఉంచుకోవడమూ సులభం. కాని ఇతరుల యెడల దయతో మెలగడం కష్టం. అయినా దయాగుణం అలవర్చుకొన్నవాడే దొడ్డవాడు.

1. అబ్రాహాము తన కుమారుడు ఈసాకునకు పిల్లను వెదకడానికై సేవకుణ్ణి పంపాడు. అతడు ఒంటెలతో వెళ్ళి ఆరాము అనే గ్రామం చేరుకొని ఆ యూరి దిగుడుబావివద్ద దిగాడు. అప్పడు అబ్రాహాము తమ్ముని కుమారుడైన బెతువేలుని కుమార్తె రిబ్కాబావికి నీళ్ళకు వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి ఆబ్రాహాము సేవకుడని ఆమెకు తెలియదు. ఆ బాలిక అతనికి నీళ్లు చేది యిచ్చింది. దయతో అతని ఒంటెలకుగూడ నీళ్లు తెచ్చిపోసింది. తరువాత ఆ యువతిని ఈసాకునకిచ్చి పెండ్లిచేయడం జరిగింది - ఆది 24, 18-19.

2. సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికై ఎంగెడీ ఎడారి అంతా గాలిస్తున్నాడు. ఓమారు సౌలు మలవిసర్జనకై ఆ ఎడారిలోని ఓ కొండ గుహలో ప్రవేశించాడు. అంతకు ముందే దావీదు తన అనుచరులతో ఆ గుహలో దాగివున్నాడు. అలా తలవని తలంపుగా గుహలోనికి వచ్చిన సౌలునుజూచి అతన్ని చంపివేయమని మిత్రులు దావీదుకు సలహా యిచ్చారు. కాని రాజుపై గల గౌరవంచే దావీదు అతన్ని ముట్టుకోలేదు. సౌలు తనకు దొరికిపోయాడు అనడానికి ఆనవాలుగా దావీదు అతని ఉత్తరీయపు చెంగుమాత్రం కత్తిరించుకొన్నాడు. అలా దావీదు తనపట్ల దయజూపి తన బొందిలో ప్రాణాలు నిలిపినందుకు సౌలు చాల ఆశ్చర్యపడ్డాడు. 1 సమూ 24, 11-16,

3. సౌలు కుమారుడైన యోనాతాను దావీదునకు మిత్రుడు. ఈ యోనాతాను కుమారుడు మెపిబోసెతు. ఇతడు అవిటికాలివాడు. సౌలు కుటుంబమంతా యుద్ధంలో నాశమైపోయాక దావీదు మెపిబోసెతును పిలిపించి అతని మీద దయజూపాడు. అతన్ని రోజూ తన సరసన కూర్చుండి భోజనం చేయమని చెప్పాడు. ఆలా రాజాదరణ పొందిన మెపిబోసెతు "నేను చచ్చిన కుక్కలాంటివాణ్ణి గదా! దావీదు ప్రభువు నాపట్ల యింత కరుణ జూపాలా" అని విస్తుపోయాడు -2 సమూ 9, 7-8.

4. రూతు నవోమికి కోడలు. ఈ నవోమి బోవను బంధువురాలు. బోవసు ధనవంతుడు. నవోమి పేదరాలు. ఓ దినం రూతు బోవసు పొలంలో పరిగలేరుకోవడానికి పోయింది. బోవసు ఆమెను కరుణతోజూచి పరిగలేరుకోనిచ్చాడు. తన కూలివాళ్లతోగూడ ఆమెను బాధించవద్దని చెప్పాడు. ఆమెకు దాహమైనప్పడు కూలివాళ్ళ చేదుకొని వచ్చిన