పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త్రి పురుషులు లేక భార్యాభర్తలు లైంగికంగా కలసికొన్నపుడు ఏలా ఏక శరీరమౌతారో క్రీస్తు తిరుసభా కలసి అలా ఏక శరీరమౌతారు. నరుడు వేశ్యతో కలసినప్పుడు వాళ్లిద్దరు కలసి ఏకవ్యక్తి ఔతారు. అలాగే క్రీస్తు క్రైస్తవుడు కలసి ఏకవ్యక్తి ఔతారు - 1కొ 6,16-17.

క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడం వల్లకూడ అతడూ మనమూ కలసి ఏక శరీరమాతాం - రోమా 6,3-4.

క్రీస్తుని దివ్యసత్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడ అతడూ మనమూ కలసి ఏక శరీరమౌతాం - 1కొ 10,17. ఈ మూడు ఉదాహరణల్లోను ఐక్యత ప్రాముఖ్యం చెప్పబడింది.

2) తిరుసభలోని సభ్యులంతా క్రీస్తుతో కలసి ఏకశరీరం (ఏకవ్యక్తి) ఔతారు. ఈ శరీరానికి క్రీస్తే శిరస్సు తిరుసభ సభ్యులే అవయవాలు. దేహంలో ఒక్కో అవయవం ఒక్కో పనిచేసి శరీరాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే తిరుసభలోని ఒక్కో సభ్యుడూ ఒక్కొ పనిచేసి క్రీస్తు శరీరాభివృద్ధికి తోడ్పడాలి - 1కొ 12,12-13. ఇక్కడ అవయవాల ప్రాముఖ్యం చెప్పబడింది.

3) క్రీసూక్రైస్తవులూ కలసి ఏక శరీరం (ఏకవ్యక్తి) ఔతారు. ఈ దివ్యశరీరానికి క్రీస్తు శిరస్సు తిరుసభ సభ్యులు అవయవాలు - ఎఫే 1,22-23. ఇక్కడ "శిరస్సు" అంటే నాయకుడు. క్రీస్తుతో ఐక్యమైన తిరుసభను క్రీస్తు నాయకుడే నడిపిస్తాడని భావం. ఇక్కడ శిరస్సు ప్రాముఖ్యత చెప్పబడింది.

పై పౌలు వాక్యాల సారాంశమేమిటంటే ఉత్థానక్రీసూక్రైస్తవులూ ఒకేవ్యక్తి ఔతారు. కాని ఈ యైక్యతను ఏలా అర్థంజేసికోవాలి? ఇది భౌతికమైన ఐక్యత కాదు. ఉత్తానక్రీస్తూ మనమూ వేర్వేరు వ్యక్తులుగానే వుండిపోతాం. ఒకరితో ఒకరం భౌతికంగా కలసిపోం. కనుక ఇది ఆధ్యాత్మికమైన ఐక్యత, మనం జ్ఞానస్నాన విశ్వాసాల ద్వారా ప్రభువుతో ఐక్యమైనపుడు అతని వరప్రసాదం మనమిూద పనిచేస్తుంది. క్రీస్తు ఆత్మ మనలను ప్రభువతో జోడిస్తుంది. దీనివల్ల మనలోని జంతుప్రవృత్తి, పాపస్వభావం క్రమేణ అంతరిస్తాయి. క్రీస్తు స్వభావం అతని దివ్యగుణాలు మనలో నెలకొంటాయి. దీనిద్వారా ప్రాకృతిక మానవుడు క్రమేణ ఆధ్యాత్మిక మానవుడుగా మారిపోతాడు. బైబులు ఉపమానాలతో చెప్పాలంటే ఈ యైక్యత భార్యాభర్తల ఐక్యతలా వుంటుంది - ఎఫె 5,30-31. చెట్టు కొమ్మల ఐక్యతలా వుంటుంది గా యోహా 15,5. పునాదిరాయి దానిమిూద కట్టబడిన భవనం ఐక్యతలా వుంటుంది - 1షేత్రు 2,5. దేహంలోని శిరస్సు అవయవాల ఐక్యతలా పుంటుంది - 1కొరి 12,12.