పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావం క్రమేణ పెంపజెందుతూ వచ్చింది. ఇక్కడ దైవరాజ్యాన్ని గూర్చి ఎన్మిదంశాలు గుర్తించాలి. 1. హీబ్రూ బైబుల్లో దైవరాజ్యం అనేమాట అంత ప్రచురంగా కన్పించదు. కాని "ప్రభువు రాజు" "ప్రభువు పరిపాలిస్తాడు" అనే మాటలు విరివిగా కన్పిస్తాయి. యూదుల దృష్టిలో దేవుడు ప్రధానంగా రాజు.

2. యూదులకు చుట్టుపట్ల వున్న కనానీయులు మొదలైన జాతులు కూడ వాళ్ళ దేవుళ్ళను రాజులనుగానే భావించారు. కాని ఈ యన్యజాతుల దేవుళ్లు ఏదో వాక దేశానికి రాజులు, ఐతే యిస్రాయేలీయులు కొల్చిన యావే ప్రభువు ఓ దేశానికి కాక, ఓ ప్రజకు రాజు.

3. నిర్గమన కాలంలో యావేయిస్రాయేలీయులకు కాపరిగాను నాయకుడుగాను వ్యవహరించడం ద్వారా తన రాజత్వాన్ని చాటుకొన్నాడు. ప్రభువే నాయకుడై ఆ ప్రజను ఎడారిగుండ నడిపించాడు. అతని శక్తి అనంతమైంది. అతనికి త్రోవా గమ్యమూ రెండూ తెలుసు. కనుక యిప్రాయేలు జనులు అతన్ని నమ్మి అతనివెంట పయనించారు.

4. యిప్రాయేలీయులు కనాను మండలంలో ప్రవేశించాక షుమారు రెండువందల యేండ్ల న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. ఈ నాయకులు రాజులుగా వ్యవహరింపలేదు. ప్రభువే యిప్రాయేలుకు రాజు. అతని పేరు విూదిగానే పండ్రెండు తెగల యిస్రాయేలీయులు ఒక్కప్రజగా ఐక్యమయ్యారు అని న్యాయాధిపతులు భావించారు. ప్రజలు గిద్యోను అనే న్యాయాధిపతిని రాజును చేయబోగా, అతడు నిరాకరించి ప్రభువే మనకు రాజు అని చెప్పాడు - న్యాయాధి 8,23. చివరి న్యాయాధిపతియైన సమూవేలు కాలంలో ప్రజలు ఇతర జాతులకు లాగే తమకుకూడ ఓ రాజు కావాలని కోరారు. కాని సమూవేలు ప్రభువే విూకు రాజు కనుక మరోరాజు అక్కరలేదు అన్నాడు - 1సమూ 8,4-6.

5. రాజుల కాలంలోగూడ ప్రభువే ప్రజలకు నిజమైన రాజు అనే భావం వుండేది. సౌలు దావీదు మొదలైన రాజులంతా కేవలం యావే ప్రతినిధులు అనే భావం వుండేది. పాలస్తీనా దేశానికి పొరుగు దేశాలైన ఈజిప్టు బాబిలోనియాల్లో జనులు రాజులను దేవుళ్ళనుగా ఎంచారు. రాజులు దేవుని అవతారాలనుకొన్నారు. కాని యూదులు మాత్రం తమ రాజులను ఎప్పడూ నరమాత్రులుగానే పరిగణించారు. వాళ్లకు నిజమైన రాజు యావే వొక్కడే చాల కీర్తనలు యావేను రాజునుగా వర్ణిస్తాయి.

6. యావే ఒక్కయిస్రాయేలీయులకు మాత్రమే కాక లోకంలోని జాతులన్నిటికి రాజు - యిర్మీ 10,7,