పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయసూచిక

1. దైవరాజ్యం 91
2. తిరుసభ స్థాపనం 100
3. దైవరాజ్యమూ తిరుసభా 113
4. తిరుసభ ఎల్లరికీ రక్షణసాధనం 116
5. తిరుసభ ప్రేషిత సేవ 120
6. తిరుసభకు ఉపమానాలు 123
7. తిరుసభ లక్షణాలు 137
8. తిరుసభలో గృహస్థలు 144
9. తిరుసభలో అధికారం సేవకొరకే 149
10. పీఠాధిపతులు 153
11. పోపుగారి ప్రధానత్వం 159
12. పొరపడని వరం 165
 - ప్రశ్నలు 171

1. దైవరాజ్యం

సువిశేషాల్లో "తిరుసభ" అనేమాట చాల అరుదుగా కన్పిస్తుంది. ఈ గ్రంథాల్లో తరచుగా కన్పించే మాట "దైవరాజ్యం”, “కాలం సమిూపించింది. దైవరాజ్యం చేరువలో వుంది" అనే పలుకులతోనే క్రీస్తు తన బోధ ప్రారంభించాడు- మార్కు 1,15. క్రీస్తు ప్రధానంగా బోధించింది ఈ దైవరాజ్యాన్ని గూర్చే మరి యిప్పడు లోకంలో వ్యాప్తిలో వున్న తిరుసభ ఎక్కడి నుండి వచ్చింది? అది క్రీస్తు స్వయంగా స్థాపించిందే. దైవరాజ్యాన్ని వ్యాప్తిలోకి తీసుకొని రావడానికే క్రీస్తుతిరుసభను స్థాపించాడు. అది దైవరాజ్యాన్ని ప్రత్యక్షం చేయడానికే వుంది. కనుక తిరుసభను అర్థం జేసికోవాలంటే మొదట దైవరాజ్యాన్ని బాగా అర్థం జేసికోవాలి. ఈ యధ్యాయంలో దైవరాజ్యాన్ని గూర్చి మూడంశాలు పరిశీలిద్దాం.

1. పూర్వవేదంలో దైవరాజ్యం

మనం మొదట గమనింపవలసిన అంశం ఇది. దైవ రాజ్యమనేది ఓ స్థలంకాదు, ఓ శక్తి. దేవుడు తన శక్తితో ప్రజలమిూద పరిపాలనం చేస్తాడు. కనుక అసలు దైవరాజ్యం అనడం కంటె "దేవుని పరిపాలనం"అనడం మెరుగు. పూర్వవేదంలో దైవరాజ్యం అనే