పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కీర్తన - 103

దేవుడు కరుణామయుడు

1 నా యాత్మమా! ప్రభుని స్తుతింపుము
   నాలోని సమస్త శక్తులారా!
   అతని పవిత్ర నామమును సన్నుతింపుడు
2 నా యాత్మమా! ప్రభుని స్తుతింపుము
   అతని యుపకారములను వేనిని మరువకుము
3 అతడు నీ పాపములనెల్ల మన్నించును
   నీ వ్యాధులనెల్ల కుదుర్చును
4 సమాధినుండి నిన్ను కాపాడును
   ప్రేమ నెనరులనెడు దీవెనలను నీ కొసగును
5 నీ జీవితమును శుభములతో నింపును
   నీవు గరుడపక్షివలె యువకుడవుగాను శక్తిసంపన్నుడవుగాను
   మనునట్లు చేయును
6 ప్రభువు నీతిని పాటించును
   పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును
7 అతడు మోషేకు తన ప్రణాళిక నెరిగించెను
   యిస్రాయేలీయులకు తన మహాకార్యములను విశదము చేసెను
8 ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు
   దీర్ఘశాంతుడు, ప్రేమనిధి
9 అతడు మనలను నిత్యము చీవాట్ల పెట్టడు
   మనమీద కలకాలము కోపపడడు
10 మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు
   మనదోషములకు తగినట్లుగా మనలను దండింపడు
11 భూమికి ఆకాశమెంత యెత్తుగా నున్నదో
   ప్రభువుపట్ల భయభక్తులు చూపవారి యెడల
   అతని ప్రేమ. అంత మిక్కుటముగా నుండును