పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 పడమరకు తూర్పు ఎంత దూరమో
       అంత దూరముగా అతడు మన పాపాలను పారద్రోలును
13 తండ్రి తన కుమారులమీద జాలి జూపినట్లే
       ప్రభువు తనపట్ల భయభక్తులు కలవారిమీద నెనరు జూపును
14. మనమెట్ల రూపొందితిమో అతనికి తెలియును
       మనము మట్టిమానుసులమని యతడు జ్ఞప్తియందుంచుకొనును
15 నరుల జీవితము గడ్డిపరకవంటిది
       పిచ్చి మొక్కలు పూయు పూవు వంటిది
 16 ఆ పూవు మీద గాలి తోలగా అది రాలిపోవును
       అది ఇక యెవరి కంటను బడదు
17 కాని ప్రభువుపట్ల భయభక్తులు జూపువారియెడల
      అతని ప్రేమ అనాదినుండి అనంతము వరకు నుండును
18 ప్రభువు నిబంధనమును పాటించి
       అతని కట్టడల ననుసరించువారికి
       అతని రక్షణము తరతరముల వరకు లభించుచుండును
19 ప్రభువు తన సింహాసనమును ఆకసమున నెలకొల్చెను
       అతడు ఎల్లరిమీద పరిపాలనము చేయును
20 బలాఢ్యులైన ప్రభువు దూతలారా!
       అతని యాజ్ఞ పాటించి యతనిమాట వినువారలారా!
       మీరతనిని స్తుతింపుడు
21 ప్రభువు సైన్యములారా!
       అతనికి పరిచారకులై యతని చిత్తమును పాటించువారలారా!
       మీరతనిని సుతింపుడు
22 ప్రభువు సామ్రాజ్యము నందలి సమస్త సృష్టివస్తువులారా!
       మీరతనిని స్తుతింపుడు
       నా యాత్మమా! ప్రభుని స్తుతింపుము.