పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముగించక మన దైనందిన జీవితంలోగూడ కొనసాగించుకోవాలి, క్రీస్తుశ్రమలు మన అనుదిన జీవితంలోని బాధలతో ఐక్యమై మనలను పునీతులను జేస్తాయి.

3. ప్రార్ధనం, ఉపవాసం, దానధర్మాలు

మామూలుగా పాపోచ్చారణంలో గురువు విధించే ప్రాయశ్చిత్త కర్మలు మూడురకాలుగా వుంటాయి. వాటిని గురించి ఒకటిరెండు మాటలు చెప్పాలి.
1. తరచుగ గురువు మన పాపాలను పరిహారంగా రెండుమూడు పరలోక జపాలనో మంగళవార్త జపాలనో చెప్పమని ఆదేశిస్తారు. ఈ జపాలను యాంత్రికంగా ఉచ్చరించి వెళ్ళిపోతే చాలదు. మనం చేసిన అంత పెద్ద పాపాలకి యాంత్రికంగా వల్లెవేసే మూడు మంగళవార్త జపాలు ఏలా సరిపోతాయి? కనుక గురువు విధించిన ప్రార్థనలను మనం భక్తితో చెప్పకోవాలి, గురువు అపరాధంగా విధించిన జపాలు చెప్పి ముగించిన పిదప కొన్ని కృతజ్ఞతా ప్రార్థనలు చెప్పకోవడం గూడ మంచిది. వీటిద్వారా మన భక్తి బలపడుతుంది. ఇంకా మన నిత్యజీవితంలోని సమస్యలనూ బాధలనూ కూడ మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా దేవునికి అర్పించుకోవాలి. మన బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తామని ప్రమాణంకూడ చేయాలి.
2. అరుదుగా గురువు ఉపవాసాన్ని ప్రాయశ్చిత్తంగా విధించవచ్చు. లేదా మనంతట మనమే పూర్తి వుపవాసాన్నిగాని పాక్షికమైన ఉపవాసాన్ని గాని పాటించి మన పాపలకు శిక్ష చెల్లించుకోవచ్చు. ఉపవాసం ప్రాచీన కాలం నుండి శ్రీసభలో వాడుకలో వందే. దానిద్వారా మన పాపపు శరీరం అదుపులోకి వస్తుంది. మన జంతు ప్రవృత్తిని గూడ వశంలోకి తెచ్చుకోవచ్చు. ఇంకా ప్రాచీన క్రైస్తవులు ఉపవాసముండి కొన్ని భోజనపదార్ధాలను తినకుండా మానుకొనేవాళ్లు. వాటి వెలను పేదలకు దానంగా యిచ్చేవాళ్లు - యెషయా 58,6-7 ఈ సంగతిని జ్ఞప్తికి తెస్తుంది. మనంకూడ ఈ కార్యం చేయగలిగితే మంచిది.
3. అప్పడప్పుడు గురువు మన పాపాలకు శిక్షగా కొద్దిపాటి దానధర్మాలు చేయమని చెప్పడం కూడ కద్దు, లేదా మనమే మన పాపాలకు శిక్షగా మనకు చేతనైన దానాలు చేయవచ్చు. క్రీస్తు తాను స్వయంగా ధనవంతుడై యుండి మనకోసం పేదవాడుగా జన్మించాడు - 2కొ 8,19. అతడు ఇతరుల కొరకు జీవించాడు. ప్రాణత్యాగం చేసాడు. ఆ ప్రభువుని ఆదర్శంగా పెట్టుకొని మనం పేదలకు దానం చేయవచ్చు. పేదవాళూ అక్కరలో వున్నవాళూ ప్రతిచోటా మనకు తగులుతూనేవుంటారు. దానధర్మాలద్వారా పాపాలనూ వాటి శిక్షనూ తొలగించుకోవచ్చుననే భావం లూకా సువిశేషంలో చాలా