పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. డీట్రిక్ బోన్ హోపర్అనే భక్తుడు ఈలా నుడివాడు. నీవు స్వేచ్ఛను పొందాలంటే మొదట నీ యింద్రియాలనూ నీ కోరికలనూ అదుపులో పెట్టుకో. నీ దేహమూ మనస్సూగూడ నిర్మలంగా వుండాలి. అవి నీకు లొంగివుండాలి, ఆత్మ నిగ్రహం లేనివాళ్ళకు ఆత్మవరమైన స్వేచ్ఛ లభించదు.

23. శారీరక వాంఛలను జయించేలా చేసే ఆత్మ

1. మన శరీరం నిత్యం పాపక్రియలవైపు మొగ్గుతూంటుంది. కాని ఆత్మ తన వరప్రసాదబలంతో మనం ఈ శరీర వాంఛలను జయించేలా చేస్తుంది. పౌలు ఈలా చెప్పాడు. "మీరు ఆత్మయందు జీవించండి. శరీర వాంఛలను తృప్తిపరచకండి. శరీరం ਕੰ ఆత్మ కోరేదానికి విరుద్ధంగా వుంటుంది. అలాగే ఆత్మ కోరేది శరీరం కోరేదానికి విరుద్ధంగా వుంటుంది. ఈ రెండిటికీ బద్ధవైరం" - గల 5,16–17. మన ఆత్మ మంచిని కోరితే మన శరీరం చెడ్డను కోరుతుంది. ఇంకా, ఎవడు చల్లిన విత్తనాలకు తగిన పంటను వాడు కోసికొంటాడు. శరీర వాంఛలకు అనుకూలమైన విత్తనాలు చల్లేవాడికి మరణమనే పంట పండుతుంది. ఆత్మకు అనుకూలమైన విత్తనాలు చల్లేవాడు నిత్యజీవమనే పంట కోసికొంటాడు - గల 6, 7-8 పవిత్రాత్మ మన శరీరవాంఛలను మట్టపెడుతుంది. ఈ యంశాన్ని పురస్కరించుకొని పౌలు ఈలా చెప్పాడు, శరీరవాంఛల ప్రకారం జీవించే వాళ్ళు శరీరం కోరుకొనే పాపకార్యాలకే తమ మనస్సును అర్పిస్తారు. ఆత్మాభిలాషల ప్రకారం జీవించేవాళ్ళు ఆత్మ కోరుకొనే పవిత్రకార్యాలకే తమ మనస్సును అర్పిస్తారు. శారీరక వాంఛలు మరణానికీ, ఆత్మవాంఛలు జీవానికీ దారితీస్తాయి - రోమా 8,6-7.

పౌలూ పేర్కొన్నఈ సూత్రాలను రోజువారి జీవితంలో మనంకూడ అనుభవానికి తెచ్చుకొంటూనే వుంటాం. ఓవైపు మనం పాపంద్వారా పిశాచ పుత్రులం, మరోవైపు జ్ఞానస్నాన విశ్వాసాలద్వారా, వాక్కుద్వారా దేవుని పుత్రులం. కనుక పాపస్వభావమూ దైవస్వభావమూ రెండూ మనలో వుంటాయి. మనలోని ఈ రెండు స్వభావాలూ నిరంతరం ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూనే వుంటాయి. ఈ రెండు ప్రకృతులను బైబులు వెలుగు, చీకటి అనికూడ పిలుస్తుంది. ఈ రెండిటి మధ్య జరిగే పోరాటాన్ని ఆధ్యాత్మిక మానవులు గుర్తిస్తూనే వుంటారు, ఈ పోరాటంలో ఆత్మ మన పక్షాన్ని అవలంభించి మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తాన క్రీస్తూ ఆత్మా యిద్దరూ శోధనల్లో మనకు విజయాన్ని చేకూర్చి పెడతారు.