పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాటిని ఆసరాగా తీసికొని పొంగిపోతారు, కాని యీ పొంగు వాళ్ళ వినాశానికే దారి తీస్తుంది. స్వీయ బలంమీద ఆధారపడే నరుడ్డి ప్రభువు నట్టేట మంచుతాడు.

మరోతావులో పౌలు "దేవుని అనుగ్రహం వల్లనే నేనిప్పడున్న స్థితిలో వున్నాను" అని చెప్పకొన్నాడు – 1కొ 15,10. అతడు మహాప్రేషితుడు. తీతు తిమోతి లాంటి శిష్యవర్గాన్ని తీర్చిదిద్దినవాడు. కొరింతులాంటి గ్రీకు పట్టణాల్లో క్రైస్తవ సమాజాలు నెలకొల్పినవాడు. ఆ సమాజాలకు వేదాంత సూత్రాలతో నిండిన 14 పెద్ద జాబులు వ్రాసినవాడు. కాని దైవానుగ్రహం వల్లనే అతడీ కార్యాలన్నీ సాధించాడు. కనుక అతడు తన ఉచ్చ స్థితిని దేవునికే ఆరోపించుకొన్నాడు. నరుడు తన అశక్తతను గుర్తించడమంటే యిది. దేవునిమీద ఆధారపడ్డం అంటే యిది. ఏ నరుడు ఈ మనస్తత్వాన్ని అలవర్చుకొంటాడో అతడు దేవునికి ప్రియపడతాడు. దేవుని శక్తితో మహత్తర కార్యాలు సాధిస్తాడు. తాను బలహీనుడుగా వున్నపుడే బలవంతుడ నయ్యానని చెప్పకోగల్లుతాడుగూడ - 2కొ 12, 10.

ప్రశ్నలు

ఏడు మూలపాపాలు

1. గర్వస్వభావాన్నీ దానిలోని దుష్టత్వాన్నీ వివరించి, దాన్ని జయించే మార్గాలను పేర్కొనండి.

2.అసూయాగుణాన్నీ దాని వలని అనర్గాలనూ వివరించండి.

3.కోపస్వభావాన్నీ దాన్ని నివారించే మార్గాలనూ పేర్కొనండి.

4.భోజన ప్రియత్వాన్ని వివరించి దానిని జయించే మార్గాలను తెలియజేయండి.

5.మోహ స్వభావాన్నీ దానిలోని దుష్టత్వాన్నీ వివరించి, దాన్ని జయించే మార్గాలను పేర్కొనండి.

6.సోమరితనం స్వభావాన్నీ దాన్ని అరికట్టే మార్గాలనూ వివరించండి.

7. దురాశ స్వభావాన్నీ దానిలోని దుష్టత్వాన్నీ తెలియజేయండి.

నాల్గు నైతిక పుణ్యాలు

1.వివేక స్వభావాన్ని వివరించి దాన్ని సాధించే మార్గాలను తెలియజేయండి.

2.న్యాయం స్వభావాన్నీ దాన్ని పాటించే మార్గాలనూ తెలుపండి.

3.ధైర్యం స్వభావాన్ని తెలియజేసి దాన్ని సాధించే మార్గాలను పేర్కొనండి.

4.ఉపవాసం, శుద్ధభోజనం స్వభావాలను వివరించండి.