పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుంది. కనుకనే గొల్యాతుని గెల్చాడు. ఆ రాక్షసుడు వడిసెల రాయి తగిలి మొదలు నరికిన చెట్టులా కూలాడు - 1సమూ 17, 45-47.

మోషే ప్రజలను ఫరో బానిసంనుండి విడిపించిన మహా నాయకుడు. ఫరో తరపున మానుషబలము మోషే తరపున దైవబలమూ పని చేసాయి. ఈ మోషే నైలునది తుంగల్లో ఓ పెట్టెలో, వాయెత్తి యేడ్చే పసికందుగా ఫరో కూతురికి దొరికాడు. అతని అశక్తత ఆలాంటిది - నిర్గ 2, 5-6. అతడు బానిస జాతికి చెందినవాడు, నత్తివాడు410. కాని ప్రభువు ఆలాంటివాని ద్వారానే సామ్రాజ్యాధీశ్వరుడైన ఫరోను ఓడించాడు.

నూత్న వేదంనుండి ఒక్క వుదాహరణం చూద్దాం. పేత్రు చేపలను పట్టడానికి రాత్రంతా కృషి చేసాడు. కాని ఒక్క పక్కెపిల్ల గూడ దొరకలేదు, అతని కృషి ఎందుకూ అక్కరకు రాలేదు. అతడు తన ఆశక్తతను తలంచుకొని "రాత్రంతా శ్రమించినా ఫలితం దక్కలేదు" అని వాపోయాడు. నరుడు తన అశక్తతను గుర్తించినపడే గాని దేవుడు సహాయం చేయడు. ప్రభువు అతన్నిలోతులో వలవేయమన్నాడు. ఆలా వేయగానే వల పిగిలిపోయేలా చేపలు పడ్డాయి. పేత్రు ఆ సంఘటనకు ఆశ్చర్యపడి ప్రభో నేను పాపిని నన్ను విడచి పొమ్మని క్రీస్తుని అభ్యర్థించాడు - లూకా 5,8.

ఈ సంఘటనలను బట్టి యేమి అర్థం చేసికోవాలి? దేవుడు నరునికి శక్తి చాలదని నిరూపించిగాని అతనికి సహాయం చేయడు. ఏనరుడైనా నా బలం నాకు చాలు అనుకొంటే ప్రభువు అతన్ని అణగదొక్కుతాడు. అతడు గర్వాత్ముల కొమ్మలు విరగ గొట్టేవాడూ, వినయాత్మలను పైకి లేవనెత్తే వాడూను - యాకో 4,6

ఉపసంహారం

పౌలు తన బలహీనతనూ దైవబలాన్నీ బాగా అర్థం చేసికొన్నవాడని చెప్పాం. అతడు కొరింతీయుల మొదటి జాబు 1, 26-31 వచనాల్లో ఈ యంశాన్నే ప్రస్తావించాడు. కొరింతులోని అతని క్రైస్తవులు బానిసలు. ఓడలో పనిచేసే కళాసీలు, పామరులు, సమాజంలో అట్టడుగున వున్నవాళ్లు మామూలు దృష్టితో జూస్తే వీళ్లు తాడూ బొంగరమూ లేని అనామకులు. కాని ఆలాంటి వాళ్ళనే ప్రభువు తన శిష్యులనుగా ఎన్నుకొన్నాడు. ఆ నగరంలోని పండితుల నెవ్వరినీ ఎన్ను కోలేదు. లోకం అవివేకులుగాను, బలహీనులుగాను, అల్పులుగాను, విలువలేనివాళ్లుగాను భావించేవాళ్ళనే దేవుడు ఎన్నుకొంటాడు. ఎందుకు? గొప్పవాడ్డి ఎన్నుకొంటే వాడు నా గొప్పవల్లనే నేను మొనగాబ్దయ్యానని డప్పాలు కొడతాడు. ఈ డాబుని దేవుడు సహించడు. అతని యెదుట ఏ నరుడూ గొప్పలు చెప్పకోగూడదు.

ప్రేషితరంగంలో కృషిచేసే గురువులు, మఠ కన్యలు, గృహస్థలు ఓ పెద్ద పొరపాటు చేస్తుంటారు. తమకున్న అధికారం, సామర్థ్యం, పలుకుబడి, కులగౌరవం, డబ్బు మొదలైన