పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన సంభాషణావైఖరిలోకూడ అణకువ కన్పించాలి. వినమత కలవాళ్ళు ఇతరులను మాట్లాడనిస్తారు. తమ్ముగూర్చి తాము చాల తక్కువగా చెప్పకొంటారు. ఇతరుల మాటలనూ చేతలనూ అంత తేలికగా విమర్శింపరు.

వినయం కష్టమైన పుణ్యం. యథార్థంగా వినయాత్మలైనవాళ్ళు కొద్దిమందే. వినములు నిందావమానాలనుగూడ సహిస్తారు. లోకం దృష్టిలో వినయానికీ నిందావమానాలకూ విలువలేదు. కాని దేవుని దృష్టిలో వాటికెంతో విలువవుంటుంది. అది చాలు. కనుక మనం తప్పక అణకువకు అలవర్చుకోవాలి, మన అంతస్తు పెరిగేకొద్దీ అణకువకూడ పెరగాలి. కనుకనే సీరా గ్రంథం "నీవు ఎంత అధికుడవో అంత యొక్కువగా వినయాన్ని అలవర్చుకో. అప్పడు ప్రభువు మన్ననను పొందుతావు" అని చెప్తుంది - 3,18.

అనుబంధం - 2 బలహీనతలోనే బలం

రెండవ కొరింతీయుల జాబు 12, 1-10 లో పౌలు ఓ గొప్ప సత్యాన్ని పేర్కొన్నాడు. నేనెప్పడు బలహీనుణ్ణి అప్పడే బలవంతుణ్ణి అని చెప్పకొన్నాడు. ఏ నరుడైనా సరే నేను బలవంతుణ్ణి అనుకొన్నాడో ఇక దేవుని శక్తి అతని మీద పనిచేయదు. నేను బలహీనుణ్ణి అనుకొంటే దైవబలం పని చేస్తుంది. ప్రేషితోద్యమంలో ఈ సూత్రం చాల ముఖ్యమైంది. కనుక దీన్ని గూర్చి విపులంగా తెలిసికొందాం.

1. ముల్ల వదంతం

1కొ 12, 1-10 వచనాలు పరికిస్తే ఈ క్రింది విషయాలు స్పష్టమౌతాయి. పాలుకి దైవదర్శనాలు లభించాయి. అతడు దేవలోకానికి ఎక్కిపోయాడు. అక్కడ మనుష్యభాషలో చెప్పడానికి శక్యంగాని సంగతులు విన్నాడు. అది వో గొప్ప అధ్యాత్మికానుభూతి. కాని ఈ దర్శనంవల్ల పౌలుకి ఎక్కడ తల తిరుగుతుందోనని ప్రభువు అతనికి వోమల్లు గుచ్చుకొనేలా చేసాడు. అది పిశాచం దూతగా పనిచేసింది. అతన్ని అణచి వుంచడానికి వుపయోగపడింది.

ఏమిటి ఈ మల్లు? ఈ పదానికి వ్యాఖ్యాతలు చాల అనర్గాలు చెప్పారు. బహుశ వాటిల్లో సబబైన అర్థం యిది. పౌలుకి ఎదురైన బాధలే ఈమల్ల, అతడు వ్యాధి బాధలు, ఆకలి దప్పులు, వేదహింసలు, మిత్రద్రోహం, నానాపదలూ, ఆందోళనలూ, భయాలూ, మొదలైనవన్నీ అనుభవించాడు. ఈ శ్రమలను గూర్చి 2కొ 11,23-29లో సవిస్తరంగా చెప్పకొన్నాడు.

ఈ శ్రమలతోపాటు అతనికి ప్రతిపక్షుల పీడకూడ ఎదురైంది. యూద క్రైస్తవుల్లో కొందరు మోషే ధర్మశాస్త్రం కూడ క్రైస్తవులను రక్షిస్తుందని వాదించేవాళ్ళు. వీళ్ళే "యూదమతాభిమానులు, కాని పౌలు ఈ వాదాన్ని ఖండించాడు. ధర్మశాస్త్రంకాదు, క్రీస్తుపట్ల విశ్వాసం మాత్రమే మనలను రక్షిస్తుందని బోధించాడు, కనుక పై యూదమతాభిమానులు