పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంతమంది తీరికగా గూర్చుండి లైంగికమైన కోరికలు కోరుకొంటూ తీయని ఊహలతో నిమిషాలూ గంటలూకూడ గడిపివేస్తూంటారు. ఇది చాల చెడ్డ పద్ధతి, నిప్పను పట్టుకొంటే కాలకుండా వుంటుందా? బొగ్గును తాకితే మసి కాకుండా వుంటుందా?

సోమరితనానికీ కామవాంఛలకూ దగ్గరి సంబంధం వుంది. మనం కష్టపడి పనిచేసుకొంటూన్నంత కాలం కామవాంఛలు అట్టే తలయెత్తవు. కాని సోమరితనంతో పనిని మానివేసి తీరికగా కూర్చుంటే ఈలాంటి కోరికలు ఎక్కుమోతాయి. కనుక కష్టపడి పనిచేసికోవడం ఈ దుష్టవాంఛలకు విరుగుడులాంటిది.

కామవాంఛలను అరికట్టడానికి ఒక సాధనం దైవసాన్నిధ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. మనం గ్రహించినా గ్రహించకపోయినా అందరంకూడ నిరంతరం దేవుని సాన్నిధ్యంలోనే వుంటాం. ఆ ప్రభువు కర్మసాక్షి. నరుల పనులన్నిటిని గమనించేవాడు. మహాపవిత్రుడైన ఆ దేవుని సమక్షంలో చెడ్డపనులు ఏలా చేయగలం? ఈలాంటి భక్తి భావంతోనే యోసేపు సూసన్నలాంటి పుణ్యాత్ములు కామశోధనల నుండి తప్పించుకొన్నారు. ఆ మహానుభావులు మనకుకూడ ఆదర్శంగా వుంటారు.

ఇంద్రియ వాంఛలను జయించాలంటే ప్రార్ధనం అత్యవసరం. మనకు సాధ్యమైంది మనం చేయాలి. సాధ్యంగానిదాని కొరకు దేవుణ్ణి ప్రార్ధించాలి. మనంతట మనం భోగవాంఛలను జయించలేం, ప్రార్ధన దయచేసే దివ్యశక్తి వల్ల క్రమేణ లైంగిక వాంఛలను జయించగలుతాం. అలాగే, దేవద్రవ్యానుమానాలుకూడ ఈ జంతువాంఛలను జయించడానికి సాయపడతాయి. భక్తిగల పాపోచ్చారణంవల్ల ఈ రంగంలో మనం చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటాం. భావి పాపాలనుండి తప్పించుకోవడానికి వలసిన శక్తినిగూడ పొందుతాం. దివ్యసత్రసాదంలో మహా పవిత్రుడైన దేవుణ్ణి స్వీకరిస్తాం. ఆ ప్రభువు పాబ్రిత్యం మన జంతు వాంఛలను అణచివేసి మనకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. మోహవాంఛలను జయించాలంటే దివ్యసత్ర్పసాదాన్ని మించిన సాధనంలేదు. ప్రభువు అగస్టీను భక్తునితో "అన్ని భోజనాలు విూలోనికి మారతాయి. కాని ఈ భోజనం మాత్రం మిమ్మ నాలోనికి మార్చుకొంటుంది" అని చెప్పాడు. కనుక మనం ఈ దివ్యభోజనాన్ని యోగ్యంగా భుజించి దేవునిలోనికి మారుతూండాలి.

5. ఆత్మ శోధనం

1. ఒక్కొక్కడికి ఒక్కో ప్రధాన దుర్గణం వుంటుంది. కొందరి బలహీనత ప్రధానంగా లైంగికరంగంలో కన్పిస్తుంది. నీవు కూడ ఈ బలహీనత కలవాడివి కాదు కదా?

2. నీవు మోహాన్ని రెచ్చగొట్టే పరిస్థితులనుండి చిత్తశుద్ధితో ప్రక్కకు తప్పకొంటూంటావా మూర్ధంగా వాటిల్లో తలదూరుస్తుంటావా? 192