పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ వ్యాధిని నయంజేయడానికి సహజమార్గం కూడ వుంది. అది మనస్తత్వశాస్త్రజ్ఞల నుండి సలహా పొందడం.

3) శారీరకమైన వ్యాధి : దీనివల్ల మన శరీరానికి జబ్బుచేస్తుంది. ఈ వ్యాధికి కారణం రోగక్రిములూ అపాయాలూ అలసటా మొదలైనవి. ఈ వ్యాధిని తొలగించడానికి తిరుసభ నిర్ణయించిన మార్గం అవస్థాభ్యంగనం. ఈ వుద్యమం అనుసరించే మార్గం శారీరక ఆరోగ్యంకోసం విశ్వాసంతో ప్రార్ధన చేయడం. ఈ వ్యాధిని నయంజేయడానికి సహజమార్గం ఔషధ సేవ.
4) పిశాచం పూని పై వ్యాధుల్లో కొన్నిగాని అన్నీగాని కలిగించవచ్చు. ఈ వ్యాధిని తొలగించడానికి తిరుసభ నిర్ణయించిన మార్గం దయ్యాన్ని పారద్రోలే తిరుసభ ప్రార్థనలు జపించడం. ఈ వుద్యమం అనుసరించే మార్గం పిశాచ విముక్తికై ప్రార్థన చేయడం. ఈ వ్యాధిని నయంజేయడానికి సహజమార్గమేమిలేదు.
5) క్రైస్తవ సమాజంలో కొందరికి వ్యాధులను నయంజేసే శక్తి వుంటుంది. ఇది ఆత్మ యిచ్చే వరం - 1కొ 12,9. కాని అందరూ ప్రభువు వాగ్లానాన్ని నమ్మకొని వ్యాధి నివారణం గావాలని ప్రార్థన చేసికోవచ్చు. "ప్రార్థనలో మీరు దేనిని అడిగినా తప్పకుండా పొందుతామని విశ్వసించండి" అన్న ప్రభువాక్యం ఉండనేవుంది - మార్కు 11,24 వ్యాధి నివారణకు ఈ విశ్వాసం అనేది అత్యవసరం.

వ్యాధి నివారణంకోసం ప్రార్ధన చేసికొనేపుడు మన ప్రవర్తనం ఏలా ఉండాలి? మనకు వ్యాధి నయంజేసేవాడూ, చేయాలని కోరుకొనేవాడూ ప్రభువు. కనుక మొదట మన మనస్సు అతని మీద లగ్నం కావాలి. అటుపిమ్మట మనం ఏ అవయవంలో లేక రంగంలో ఆరోగ్యంకోరుకొంటున్నామో ప్రభువుకి తెలియజెప్పి ఆరోగ్యదానం కోసం ప్రార్ధనం చేసికోవాలి, ఆరోగ్యంతోనూ శక్తితోనూ ప్రేమతోనూ మన శరీరాన్ని నింపమని ఆ ప్రభువుని అడుగుకోవాలి, కడన ఆ ప్రభువు మనకు ఆరోగ్యం ప్రసాదించాడనీ లేక ప్రసాదిస్తాడనీ నమ్మాలి.అతని కృతజ్ఞత తెలియజేయాలి. దీనివల్ల హృదయంలో శాంతీ సంతోషమూ నెలకోంటాయి.

4. దేవుని ఆత్మ మనకు భయాన్ని కలిగించదు - రోమా 8, 13. సంతోషాన్ని ఆనందాన్ని ప్రేమనీ అనుగ్రహిస్తుంది - గల 5,22. కనుక ఈ యాత్మచే నడిపింపబడే భక్తులకు అనారోగ్యమూ విషాదమూ గాక, ఆరోగ్యమూ, ఆహ్లాదమూ లభిస్తుంది. ఈ వరాల కోసం మనం ఆత్మను ప్రార్ధించాలి.