పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. కొందరు క్రైస్తవులు వ్యాధి సోకినపుడు మందులు వాడ్డానికి అంగీకరించరు. దేవుని యందు విశ్వాసముంచితే చాలాదా అని వాదిస్తారు. ప్రోటస్టెంట్లు క్త్రెస్తవులు ఈలాంటివాళ్ళ కన్పిస్తారు. ఈలాగే కొందరు క్యాతలిక్ క్రైస్తవులు వ్యాధిని నయంజేసే ప్రార్థనలను వాడుకోవడానికి అంతగా అంగీకరించరు. ఇవి రెండూ విపరీత ధోరణులు, ప్రార్ధనద్వారా దేవుని ఆశీర్వాదమూ అడుగుకోవాలి, మందుల ద్వారా మన ప్రయత్నమూ మనం చేయాలి, తరచుగా ప్రభువు మందుల ద్వారా మనకు ఆరోగ్యం ప్రసాదిస్తాడు.

ఇక, వ్యాధి సోకినపుడు క్రీస్తు సిలువ మనమీద భారంగా వ్రాలుతుంది. జ్ఞానస్నానం పొందినపడే మనం అతని సిలువలో పాలుపంచుకొంటాం - రోమా 6,3. ప్రభువు మనలను రక్షించేది ఈ సిలువ ద్వారానే. కనుక వ్యాధిబాధలు కేవలం చెడ్డవిగావు. వాటిద్వారా గూడ ప్రభువు మనలను దీవిస్తాడు. ఒకోమారు అవి లేకపోతే మనం ప్రభువుచెంతకు పోనేపోము.

6. ప్రభువు అంతరంగికమైన ఆరోగ్యం ప్రసాదించేవాడు

1. జీవితంలో బాధలు ఎదురౌతుంటాయి, ఈ బాధలవల్ల మనం హైన్యభావాల వంటి మనస్తత్వాలూ, కోపంవంటి మనోభావాలూ, త్రాగుడువంటి దురభ్యాసాలూ అలవర్చుకొంటాం. ఇవి మన బాధలు. కాని ఈ బాధలు మనపూర్వ జీవితంలో జరిగిన కొన్ని విషమసంఘటనలను ఆధారంగా జేసికొని ఉద్భవించాయి. ఈ పూర్వ సంఘటనలు చాలవరకు మన బాల్యప్రాయానికి సంబంధించినవి. మనం నాలుగైదేండ్లప్రాయంలో వున్నపుడు కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగాయి. వాటి స్మృతులు మన అజ్ఞాత మనస్సులో గూడగట్టుకొని వుంటాయి. వాటి నిప్పడు అంత సులభంగా జ్ఞప్తికి తెచ్చుకోలేం. కాని ఆ పూర్వ స్మృతులు ఊరుకోవు. పిలకలు వేస్తుంటాయి. వీటివలన ఇప్పడు మన జీవితంలో హైన్యభావాలవంటి బాధలు ఏర్పడతాయి. అనగా ఆనాటి బాల్యస్మృతులవల్ల ఇప్పడు మనం కానిపనులు చేస్తాం. కనుక ఇవి వ్యాధుల్లాంటివి. ఈ స్మృతులనుండి గూడ ప్రభువు మనకు ఆరోగ్యం దయచేస్తాడు.

2. ప్రభువుకి మన భూతకాలంగూడ బాగా తెలుసు. అతడు నిన్నా ఈనాడూ, ఎప్పడూ ఒకేరీతిగా వుండేవాడు - హెబ్రే 13,8. మనం చిన్నపిల్లలంగా వున్నపుడు జరిగిన విషాదసంఘటనలూ వాటివల్ల మనం కలిగించుకొన్నపూర్వస్మృతులూ ఆ ప్రభువుకి తెలుసు. ఆ స్మృతులు ఇప్పుడు మనజీవితంలో చిక్కులు తెచ్చిపెడుతున్నాయనిగూడ అతనికి