పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొండమీద క్రీస్తు ముఖం సూర్యుళ్ళా ప్రకాశించింది. అతని దుస్తులు వెలుగులా తెల్లనయ్యాయి - మత్త 17,2. ఆ బట్టలు యే చాకలీ చలువచేయలేనంత తెల్లగా వున్నాయి - మార్కు 9,2. ఇక్కడ క్రీస్తు దుస్తులూ ముఖమూ ప్రకాశించాయంటే అతని మూర్తి ప్రకాశించిందని భావం. ఈలాంటి ప్రకాశాన్ని క్రీస్తు పూర్వమెప్పడూ ప్రదర్శింపలేదు. ఈ ప్రకాశం భవిష్యత్తులో రానున్న అతని ఉత్ధాన తేజస్సుని సూచిస్తుంది. ఆ యంశం తర్వాత చూద్దాం.

4. మోషే, యేలీయా. కొండమీద మోషే యేలీయా క్రీస్తుతో మాటలాడు తున్నట్లుగా కన్పించారు. ఇక్కడ మోషే పూర్వవేదంలోని ధర్మశాస్తాన్ని సూచిస్తాడు. ఏలీయా ప్రవక్తల సంప్రదాయాన్ని సూచిస్తాడు. ధర్మశాస్త్రమూ ప్రవచనాలు పూర్వవేదంలోని రక్షణ సాధనాలు. అవి రెండూ రానున్న మెస్సీయాను గూర్చి చెప్తాయి. ఇక యిప్పుడు వీటిపని అయిపోయింది. అవి సూచించే మెస్సీయా రానే వచ్చాడు. అతడు త్వరలో రక్షణకార్యం నిర్వహిస్తాడు. కనుక ఇక్కడ మోషేయేలీయాలు క్రీస్తు రాకడనీ, అతని రక్షణోద్యమాన్నీ ప్రశంసిస్తున్నారని అర్థం చేసికోవాలి.

ఈ భక్తులిద్దరు కొండమీద క్రీస్తుతో ఏమి మాట్లాడారు? ప్రభువు యెరూషలేములో మరణింపవలసిన అంశాన్ని గూర్చి మాట్లాడారు - లూకా 9,31. ఎప్పుడూ ప్రభువు మరడోత్థానాలు రెండూ కలసే వుంటాయి. కనుక ఆ పూర్వవేద భక్తులు క్రీస్తు మరణోత్ధానాలనుగూర్చి, వాటిద్వారా అతడు సాధించబోయే మానవ రక్షణాన్నిగూర్చి సంభాషించారు. పూర్వవేదంలోని ధర్మశాస్త్రమూ ప్రవచనాల ఉద్దేశంకూడ ఇదేనని ముందే చెప్పాం.

5. తండ్రి సాక్ష్యం బహుశ అన్నిటికంటె ముఖ్యమైన అంశం కొండమీద తండ్రి క్రీస్తుకి సాక్ష్యం పల్కడం. అతడు "ఇతడు నా ప్రియకుమారుడు, నేనెన్నుకొనినవాడు. మీరు ఇతని పల్ములు ఆలకించండి" అని చెప్పాడు - లూకా 9,35. ఇది తండ్రి క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో పల్కిన సాక్ష్యం లాంటిదే. క్రీస్తు మరణోత్తానాలతో గూడిన రక్షణ ప్రణాళికను సిద్ధంచేసింది తండ్రే. కనుక అతని ద్వారానే క్రీస్తు మరణోత్థానాలు నెరవేరతాయి. ఇప్పడు కొండమీద క్రీస్తుకి తాత్కాలికమైన ప్రకాశాన్ని ప్రసాదించిందికూడ ఈ తండ్రే.

ఇక్కడ తండ్రి పల్కిన సాక్ష్యంలో మూడంశాలు గమనింపదగ్గవి. మొదటిది, తండ్రి క్రీస్తు తనకు "ప్రియకుమారుడు" అని చెప్పడం. "నీవు నా కుమారుడివి. ఈ దినం నీవు నాకు జనించావు" అంటుది కీర్తన 2,7. ఇది మెస్సీయాను గూర్చిన వాక్యం. తండ్రి పల్కిన పైమాట ఈ కీర్తన వాక్యాన్ని జ్ఞప్తికి తెస్తుంది. ఉత్థానంద్వారా క్రీస్తు మెస్సీయా ఔతాడు. రెండవది, క్రీస్తు తండ్రి "యెన్నుకొనినవాడు. ఇక్కడ "ఎన్నుకొనినవాడు" అనే